Winter Garlic: వింటర్‌ సీజన్‌ లో వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు

చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Winter Garlic: వింటర్‌ సీజన్‌ లో వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు
New Update

శీతాకాలం(Winter)  మొదలైపోయింది...చాలా కామన్‌ గా జలుబు(Cold) , దగ్గు(Cough) కూడా మొదలైపోతాయి. చిన్నపిల్లలకే కాదు..పెద్దవారికి కూడా ఈ ప్రాబ్లెమ్‌ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఈ వింటర్‌ లో వాటితో పోరాడేందుకు వెల్లుల్లిని తీసుకోమంటున్నారు పెద్దలు. అందులో జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంలో బాగా సహాయపడుతుంది.

చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను(Garlic) తినడం వల్ల బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరిగి కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి. రక్తాన్ని పలుచగా చేసి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Also read: అయోధ్య రామయ్యకి 8 అడుగుల బంగారు సింహాసనం

జలుబు, దగ్గును కంట్రోల్‌ చేస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి. వెల్లుల్లిని చట్నీ గా చేసుకోవడం, కూరల్లో కూడా వెల్లుల్లిని వేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలో వేడి పుట్టించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

రక్త ప్రసరణ పెరగడంతో పాటు ఉష్ణోగ్రతను పెంచుతుంది. సాధారణంగా వింటర్‌ స్టార్ట్‌ అయ్యిందంటే..శరీరంలో రోగనిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది. దాంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వస్తుంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. చలికాలంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

#lifestyle #garlic
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe