Almonds: బాదం తింటున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

సహజంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ఒకటి బాదం. వీటిలోని విటమిన్ ఈ, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలు, బీపీనీ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.

New Update
Almonds: బాదం తింటున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

Health Benefits of Almonds: ఉదయాన్నే నాన బెట్టిన డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు చాలా మంది. వాటిలో ఒకటి బాదం పప్పు. బాదంలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలోని విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అసలు బాదం తింటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

పుష్కలమైన పోషకాలు
ఇతర డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే బాదంలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ & పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలు అత్యధికంగా ఉంటాయి.

Eat soaked almonds

Also Read: నోరు పొడిబారడం.. దాహంగా అనిపించడం… ఇవన్నీ వేడికి మాత్రమే కాదు…

గుండె సమస్యలకు చెక్
బాదం పప్పులను తరచూ తీసుకునే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఆరోగ్యకరమైనది కొవ్వులు, విటమిన్-ఇ, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

హై మెగ్నీషియం కంటెంట్
బాదంలో తక్కువ కేలరీలు, హై ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే వీటిలోని అధిక మెగ్నీషియం రక్తంలోని చక్కెర స్థాయిలు, రక్తపోటును నియంత్రిస్తాయి.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచును
వీటిని విటమిన్ ఈ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదంలో పీచుపదార్థం మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు