Copper Bottles: సహజంగా అందరికీ స్టీల్ లేదా ప్లాసిటిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం అలవాటు. కాపర్ (రాగి) పాత్రల్లో నీళ్లు లేదా ఆహరం తీసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రలోని పోషక గుణాలు ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
- రాగి పాత్రల్లో ఆహరం, నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి పోరాడతాయి. వీటిలోని నీళ్లు తాగడం ద్వారా రక్తపోటు, థైరాయిడ్, రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది.
- రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పాత్రల్లోని గుణాలు నీటిలోని హానికరమైన క్రిములను తొలగించి.. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాదు పొట్టలో పుండ్లు, అజీర్ణం కడుపు ఇన్ఫెక్షన్లకు రాగి అద్భుతమైన ఔషధం.
- అధ్యయనాల ప్రకారం రాగి శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. సాధారణంగా పెద్ద వయసు వారిలో రాగి లోపం రక్తపోటుకు కారణమవుతుంది. ఈ రాగి పాత్రల్లో నీళ్లు, లేదా ఆహరం తీసుకోవడం ద్వారా రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది.
- అధిక బరువుతో బాధపడుతున్న వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు తాగడం వల్ల కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాదు రాగిలోని యాంటీ ఆక్షిడెంట్ లక్షణాలు క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడతాయి.
- ప్రతీ రోజూ రాగి పాత్రలో నీటిని తాగడం ద్వారా శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి పోరాడి.. చర్మం పై ముడతలను తొలగించి వయసు కనిపించనివ్వకుండా చేస్తుంది.
- కాపర్ థైరాయిడ్ గ్లాండ్ అసమానతలను బ్యాలెన్స్ చేసి.. థైరాయిడ్ గ్రంధి మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రాగి నీటిని తాగడం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
- మన చర్మానికి తగిలిన గాయాన్ని రాగి నీటితో కడగడం వల్ల ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచి వెంటనే నయం చేస్తుంది.
- రక్తహీనతతో బాధపడుతున్న వారు రాగి పాత్రలో నీళ్లు తాగితే చాలా మంచిది. రాగి హీమోగ్లోబిన్ తయారీకి కావాల్సిన ఇనుము శోషణకు సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : పొట్టలో పేరుకున్న కొవ్వు కరిగిపోవాలా..అయితే కీరా దోసను ఇలా ట్రై చేయాల్సిందే!