Amla Benefits : ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

ఉసిరిని ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా అంటారు. పూర్వ కాలం నుంచి ఉసిరి ఎన్నో రకాల వ్యాధులకు ఆయుర్వేదంలా పని చేస్తుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే చాలా మంచిది. జీవక్రియ, రోగనిరోధక శక్తి, షుగర్ లెవెల్స్, నిర్వహణ పై మంచి ప్రభావం చూపుతుంది.

New Update
Amla Benefits : ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

ఉసిరి పుష్కలమైన పోషకాహారాలను, ఆరోగ్య లాభాలను కలిగి ఉండును. రోగనిరధకశక్తిని పెంచడానికి ఇది సరైన ఎంపిక. వీటిలోని ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపును.. వగరు, పులుపు, చేదు, తీపి, రుచులను కలిగిన ఉసిరి జ్యూస్ రోజూ ఉదయాన్నే ఖాళీ కదుపుతో తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు:

విటమిన్ C పుష్కలంగా ఉండును
ఉసిరిలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి శరీరంలో ఆక్సిడెటివ్ ఒత్తిడిని తగ్గించును. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే జబ్బుల బారిన పడకుండ రక్షించును.
జీవక్రియను మెరుగుపరుచును
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే జీవక్రియను మెరుగ్గా చేయును. అంతే కాదు శరీరంలో పోషకాలు శోషణకు సహాయపడును. ఇలా తాగితే బరువు తగ్గడానికి తోడ్పడును.
రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించును
కొన్ని నివేదికలు ప్రకారం ఉసిరి రక్తంలోని చక్కెర స్థాయిలు పై మంచి ప్రభావం చూపును. మధుమేహం సమస్య ఉన్నవారు ఖాళీ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ ను నిర్వహించడానికి సహాయపడును.
శరీర నిర్విషీకరణకు ఉపయోగపడును:
ఉసిరిలో జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి ఉపయోగపడే నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉండును. దీనితో చేసిన జ్యూస్ రోజు తాగితే శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపి అన్నవాహికను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడను.

జీర్ణక్రియను మెరుగపరుచును:
ఉసిరి లక్షణాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుచును. ప్రతీ రోజు ఉదయం ఉసిరి జ్యూస్ తాగితే అజీర్ణత, కడుపుబ్బరం, యాసిడిటీ సమస్యలను దూరం చేయును.

Also Read: టోపీ పెట్టుకుంటే బట్టతల ఖాయమా?..ఏది నిజం?

Advertisment
తాజా కథనాలు