Black Guavas: నల్ల జామకాయలతో ఆరోగ్యానికి జరిగే మేలు తెలుసుకుంటే షాక్ అవుతారు!

న‌ల్ల జామ‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌రల్స్, పీచు ప‌దార్థాటు విట‌మిన్ ఎ, బి, సి వంటి ఎన్నో పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి. న‌ల్ల జామకాయ‌ల‌ను తింటే శ‌రీరంలో రోగ నిరోధ‌కశ‌క్తి పెరిగి ఇన్ఫెక్షన్‌ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Black Guavas: నల్ల జామకాయలతో ఆరోగ్యానికి జరిగే మేలు తెలుసుకుంటే షాక్ అవుతారు!

black guava benefits: చిన్నా పెద్ద అనే తేడా లేకుండా జామ పండ్లను ఇష్టంగా తింటారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే ఈ జామపండు అంటే అందరికీ తెలిసి ఉంటుంది. మనం తినే పండ్లలో జామ పండు కూడా ఒకటి. ఈ పండు ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని ఇష్టంగా తింటారు. ఈ జామ పండ్లను రోజూ తింటే రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీన్ని ఆహారంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ప్రకృతిలో సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండి తెలుపు, లైట్ పింక్ రంగుల్లో గుజ్జును కలిగి జామ పనులు ఉంటాయని అందరికీ తెలిసింది. కానీ అలా కాకుండా జామకాయల్లో నల్ల రంగులో ఉంటాయని చాలామందికి తెలియదు. అవును జామకాయలు నల్లజాతి కాయలు కూడా ఉన్నాయి. ఇవి పైన నల్లగా లోపల రంగు గుజ్జుతో ఈ నల్ల జాతి కాయలు ఉన్నాయి.

Also Read: ఒక్క బెండకాయ చాలు.. మీ ఆరోగ్య సమస్యలన్నీ పరార్..!

అంతేకాకుండా చెట్టు ఆకులు, పువ్వులు, కాండం అన్నీ కూడా నలుపు రంగులోని ఉన్నాయి. వీటి గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఇతర జామకాయల వలన ఈ నల్ల జామకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే.. సాధారణంగా లభించే జామకాయల కంటే నల్ల జామకాయల్లో పోషకాలు అధికంగా ఉన్నాయి. ఈ న‌ల్ల జామ‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌రల్స్, పీచు ప‌దార్థాటు విట‌మిన్ ఎ, బి, సి వంటి ఎన్నో పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి. న‌ల్ల జామకాయ‌ల‌ను తింటే శ‌రీరంలో రోగ నిరోధ‌కశ‌క్తి పెరిగి ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి. ఈ జామకాయలు ఐరన్ ఎక్కువ. ఈ జామకాయలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అద్భుతంగా అందుతాయి. పోషకాహారం లోపం సమస్యలు రాకుండా చూస్తుంది.
శరీరంలో ఉన్న కొవ్వు కరిగిస్తుంది
అంతేకాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వృద్ధాప్య ఛాయాలను దరిచేరకుండా ఈ జామకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్ల జామకాయల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ తింటే మలబద్ధకం పోయి, జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. రక్తహీనత సమస్యలతో బాధపడుతుంటే నల్ల జామకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఈ నల్ల జామకాయల్లో ఎర్ర ర‌క్తక‌ణాలు అధికంగా పెంచేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. వీటిని రోజూ తింటే షుగర్ లెవెల్ తగ్గి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అందుకని షుగర్ ఉన్న వారు తరచూ ఈ పండును తినొచ్చు. అధిక బరువు, శరీరంలో ఉన్న కొవ్వు కరిగించేందుకు ఈ పండు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఇతర జామకాయలు వల్లే నల్ల జామకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని కూడా మనం రోజూ ఆహారంగా తీసుకోవచ్చని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు