Ear Phones or Head Phones: హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్..? ఈ రెండిటిలో ఏది బెస్ట్? ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్ అన్నదానిపై డాక్టర్లు తేల్చేస్తున్నారు. ఇయర్‌ఫోన్స్ నేరుగా చెవిపై నెగిటివ్ ప్రభావం చూపుతాయి. ఇయర్‌వాక్స్‌ను లోతుగా నెట్టివేస్తాయి. ఇయర్ డ్రమ్‌పై ప్రభావం చూపుతాయి. అందుకే హెడ్‌ఫోన్స్ బెటర్ అంటున్నారు. By Vijaya Nimma 10 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ear Phones or Head Phones: బస్సులో వస్తూ రోజూ ఇయర్‌ఫోన్స్ పెట్టుకోని సాంగ్స్ వినే వారు చాలా మంది ఉంటారు. ఇంట్లో కూర్చొని సిస్టమ్ ముందు హెడ్‌ఫోన్స్ పెట్టుకోని సినిమాలు చూసే వారు ఉంటారు. మరికొంత మంది మొబైల్స్‌కి కూడా హెడ్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుంటారు. ఇలా ఎవరి ఇష్టం వారిది. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? నేటి కాలంలో చాలా మంది ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ రెండిటిని ఎక్కువగా ఉపయోగించడం చెవులకు ప్రమాదం. ప్రతిరోజూ గంటల తరబడి ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల చెవి సమస్యలు వస్తాయి. చెవుడు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్ వాడకాన్ని తగ్గించాలి. వైద్యులు కూడా ఇదే సలహా ఇస్తారు. అయితే ఈ రెండిటిలో ఏది బెస్టో తెలుసుకోండి. చాలా మంది ఇయర్‌ఫోన్స్‌ను చెవులకు సురక్షితంగా భావిస్తారు, అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఇది కూడా చదవండి: అందవిహీనమైన జలపుష్పం..బ్లాబ్ ఫిష్..దీన్ని చూస్తే పక్కా భయపడతారు ముంబైకి చెందిన ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ రచనా మెహతా ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లను పోల్చి, రెండింటిలో ఏది చెవులకు తక్కువ హానికరమో చెప్పారు. డాక్టర్ ప్రకారం ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లను ఎంచుకోవడానికి వచ్చినప్పుడు, హెడ్‌ఫోన్‌లు ఖచ్చితంగా మంచి ఎంపిక. ఇది ఇయర్‌ఫోన్‌ల కంటే చెవులకు తక్కువ హానికరం అని ఆమె చెబుతున్నారు.డాక్టర్ రచనా మెహతా ప్రకారం, ఇయర్‌ఫోన్‌లు చెవుల లోపల వరకు ఉంటాయి. అంటే అవి నేరుగా మన చెవిపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇయర్ ఫోన్స్ చెవి లోపల పెట్టుకున్నప్పుడు ఇయర్‌వాక్స్‌ను లోతుగా నెట్టివేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో చెవి సమస్యలు పెరుగుతాయి. ఇది కాకుండా, ఇయర్‌ఫోన్‌లు నేరుగా మన ఇయర్ డ్రమ్‌పై ప్రభావం చూపుతాయి. బిగ్గరగా ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల చెవిపోటు వస్తుంది. ఇయర్‌ఫోన్‌లు చెవులను పూర్తిగా క్లోజ్ చేస్తాయి. అవి తేమను బ్లాక్ చేస్తాయి. ఇది చెవి ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే వినియోగదారులు ఇయర్‌ఫోన్‌లను తక్కువగా వాడాలి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #ear-phones-or-head-phones మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి