/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-25T180145.525.jpg)
YES BOSS: యంగ్ హీరో హవీష్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ మూవీ 'YES BOSS' నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ‘భాగమతి’ ఫేమ్ అశోక్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చెబుతూ హవీష్ నయా పోస్టర్ రిలీజ్ చేశారు. కాలేజీ కుర్రాడిలా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న హవీష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాను కాంచన కోనేరు సమర్పణలో కే స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ విద్యావేత్త కె.ఎల్.యూనివర్సిటీ చైర్మన్ కొనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
https://t.co/X5XHM5IXFS@idhavish#YesBoss Poster Out On Birthday. @vamsikaka
— BA Raju's Team (@baraju_SuperHit) June 25, 2024
ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ, మాటలను అందించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. కబీర్ లాల్ సినిమాటోగ్రఫీ. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక గతంలోనూ హవీస్ నటించిన నువ్విలా, సెవెన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఇప్పటివరకూ కమర్షియల్ హిట్ ఈ యువ హీరో ఖాతాలో పడలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ జోనర్ లో వస్తున్న ఈ 'YES BOSS' తప్పకుండా తన కెరీర్ లో నిలిచిపోయే విజయాన్ని అందిస్తుందని మూవీ యూనిట్ తెలిపింది. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు.
Birthday wishes to the dynamic actor @idhavish a very Happy Birthday!❤️🔥#YesBoss@santoshamsureshpic.twitter.com/OmJKpgpZou
— Suresh Kondeti (@santoshamsuresh) June 25, 2024