మీరు మీ Facebook , Instagram ఖాతాలను లింక్ చేసి ఉంటే, వాటిని ఎలా అన్‌లింక్ చేయాలో ఈ పోస్ట్‌లో చూడవచ్చు. కానీ ఖాతాలను అన్‌లింక్ చేయడం వలన మీ పోస్ట్‌లు,ఫాలోవర్స్ లేదా ఇతర సమాచారం ఏమి తొలిగిపోవు.
- మీ ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌ను తెరిచి, దిగువ కుడి వైపున ఉన్న ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మెను ఐకాన్‌పై క్లిక్ చేసి, సెట్టింగ్‌లు మరియు గోప్యత ఎంపికకు వెళ్లండి.
- అందులో అకౌంట్స్ సెంటర్‌ని ఎంచుకుని, అకౌంట్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి.
- మీ Facebook ఖాతా పక్కన ఉన్న తీసివేయి నొక్కండి.
- ఖాతాను తీసివేయి నొక్కండి, ఇచ్చిన సూచనలను చదివి, కొనసాగించు క్లిక్ చేసి, ఆపై అవును తీసివేయి (ఖాతా పేరు) క్లిక్ చేయండి.
Facebook అప్లికేషన్‌ని ఉపయోగించి అన్‌లింక్ చేయడం ఎలా?:
- మీ Facebook అప్లికేషన్‌ను తెరిచి, దిగువ కుడి వైపున ఉన్న ప్రొఫైల్ చిహ్నంపై నొక్కండి.
- దాని నుండి సెట్టింగ్‌లు & గోప్యత ఎంపికను ఎంచుకోండి.
- అకౌంట్స్ సెంటర్ ఎంపికలో See Moreని ఎంచుకోండి.
- క్రిందికి స్క్రోల్ చేసి, ఖాతాలపై క్లిక్ చేయండి.
- మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పక్కన ఉన్న తీసివేయి నొక్కండి.
- ఖాతాను తీసివేయి నొక్కండి, ఇచ్చిన సూచనలను చదివి, కొనసాగించు క్లిక్ చేసి, ఆపై అవును తీసివేయి (ఖాతా పేరు) క్లిక్ చేయండి.
వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి Facebook , Instagram ఖాతాను అన్‌లింక్ చేయడం ఎలా?
- Facebook వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ చేయండి.
- మీ ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చేసి, సెట్టింగ్‌లు & గోప్యతకి వెళ్లి, ఆపై సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్లండి.
- సైడ్‌బార్‌లోని అకౌంట్స్ సెంటర్ ఎంపిక నుండి మరిన్ని చూడండి ఎంచుకోండి.
- ఇప్పుడు ఖాతాల ఎంపికకు వెళ్లండి.
- మీ ఖాతా పక్కన ఉన్న తీసివేయి క్లిక్ చేయండి.
- ఖాతాను తీసివేయి నొక్కండి, ఇచ్చిన సూచనలను చదివి, కొనసాగించు క్లిక్ చేసి, ఆపై అవును తీసివేయి (ఖాతా పేరు) క్లిక్ చేయండి.మీరు ఈ దశలను అనుసరించడం ద్వారా మీ Facebook , Instagram ఖాతాలను సులభంగా అన్‌లింక్ చేయవచ్చు.