Black Apple: నల్ల యాపిల్ గురించి విన్నారా..సీజన్‌తో సంబంధం లేని పంట

హైబ్రిడ్ పంటలు వచ్చిన తర్వాత మార్కెట్లో రకరకాల పండ్లు వస్తున్నాయి. వాటిల్లో హెల్త్ బెనిఫిట్లతో పాటు అధిక ప్రోటీన్స్ కూడా ఆ పండ్లు ఇస్తూ ఉంటాయి. సీజనల్ ప్రకారమే మార్కెట్లో పండ్లు ఉంటాయి.. కానీ..ఈ బ్లాక్‌ యాపిల్స్ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల పండ్లు రంగు మారుతున్నాయి.

New Update
Black Apple: నల్ల యాపిల్ గురించి విన్నారా..సీజన్‌తో సంబంధం లేని పంట

Black Apple: హైబ్రిడ్ పంటలు వచ్చిన తర్వాత మనం మార్కెట్లో రకరకాల పండ్లని చూస్తూ ఉన్నాము. వాటిల్లో హెల్త్ బెనిఫిట్లతో పాటు అధిక ప్రోటీన్స్ కూడా ఆ పండ్లు ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది సీజనల్ ప్రకారమే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? పదండి చూద్దాం.

చైనా ఆధీనంలో ఉన్న పరిసర ప్రాంతాలలో.. 

యాపిల్స్‌ అంటే ఇష్టపడిన వాళ్లు ఎవరూ ఉండరు. మనం రకరకాల ఆపిల్స్ పండ్లను మార్కెట్‌లో చూస్తుంటాం. ఎక్కువగా ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉండే యాపిల్స్‌ మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఇప్పుడు వాటికి భిన్నమైనటువంటిది నల్ల యాపిల్‌ పండు గురించి మీకు తెలుసా..!! ఇవి అత్యంత అరుదైన పండని నిపుణులు అంటున్నారు. ఈ నల్ల యాపిల్స్‌ ఎక్కువగా చైనా ఆధీనంలో ఉన్న పరిసర ప్రాంతాలలోనే ఎక్కువగా పండుతాయి అంట. ఇవి చైనా(china) లోనే ఎరుపురంగు యాపిల్స్‌ అయినా హువా నియు యాపిల్స్‌ జాతికి చెందినవి.

హుహ నియు యాపిల్స్ 

టిబెట్‌లోని వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా ఈ నల్ల యాపిల్స్ (black apple) పగటి సమయంలో ఎండ కాసేటప్పుడు వీటిపైన ఆల్ట్రావయొలెట్‌ కిరణాలు పడటం.. రాత్రివేళల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు (Temperatures) తగ్గిపోవడం వల్ల ఈ ప్రాంతంలో పండించే హుహ నియు యాపిల్స్ పూర్తిగా నలుపు రంగులోను, నేరేడు పండ్లు మాదిరిగా ముదురు ఉదారంగులో పడుతాయని చెబుతున్నారు. అందువల్ల వీటిని బ్లాక్ డైమండ్ యాపిల్స్ (Black Diamond Apples) అని వీటికి పేరు వచ్చిందట. ఈ యాపిల్స్ చైనా మార్కెట్లో ఒక్కొక్కటి 575 రూపాయల వరకు పలుకుతుందట.

ఇది కూడా చదవండి: మురుగు నీటితో పంటల సాగు.. ఎన్టీఆర్ జిల్లాలో సరికొత్త విధానం

Advertisment
తాజా కథనాలు