Jasmine Tea Benefits: మ‌ల్లెపూల‌తో టీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?

ప్రకృతి ప్రసాదించిన అందమైన పూలల్లో మల్లెపూవ్వు ఒకటి. మల్లెపూల వాసన చూస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మల్లెపూల టీ తాగితే రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. దీంతోపాటు వృద్ధాప్య ఛాయ‌లు, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌, దంత సమస్యలు రాకుండా ఉంటాయి.

New Update
Jasmine Tea Benefits: మ‌ల్లెపూల‌తో టీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?

Jasmine Tea Benefits: పూలు మనకు ప్రకృతి ప్రసాదించిన అందమైన వరం..పూలల్లో ఎన్నో రకాలు, మరెన్నో సువాసలు ఉన్నాయి. చక్కటి సువాసన కలిగిన వాటిలో మల్లెపూలది మొదటి స్థానమనే చెప్పాలి. మల్లెపూల వాసన చూస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉత్తేజం వస్తుంది. మల్లె పూలు పూజతో పాటు అలంకరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని నిరూపితమైంది. పలు అనారోగ్య సమస్యల బారి నుంచి మనల్ని మల్లెపూలు కాపాడుతాయి. ఇక వీటితో టీ చేసుకుని తాగితే మనకు ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. మన దేశంలో పెద్దగా మల్లెపూల టీ గురించి తెలియకపోయినా జపాన్‌, చైనాలాంటి దేశాల్లో ఈ టీకి ఎంతో డిమాండ్‌ ఉంది. అసలు మల్లెపూలతో టీ ఎలా తయారు చేస్తారు.. ఇది తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మల్లెపూల టీ తయారు విధానం

ఈ మల్లెపూల టీ తయారు చేయడానికి పూలను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. పూలను, టీపొడిని 7:1 శాతంగా తీసుకోవాలి. తర్వాత గిన్నెలో గ్లాసు నీరు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత పూలు, టీపొడి వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత వడపోసుకుని సరిపడా పటిక బెల్లం లేదా తేనె కలుపుకొని తాగవచ్చు. మల్లెపూల టీ తాగితే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే రక్తంలో చెడు కొవ్వు కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఈ టీ తాగితే శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది. జ‌లుబు, ద‌గ్గులాంటి ఇన్‌ఫెక్షన్లు మర దరిచేరవు.

ఇది కూడా చదవండి: పారిజాత చెట్టుతో ప్రయోజనాలెన్నో..ఇంట్లో ఉండాల్సిందే

అలాగే.. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. తొందరగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ టీ బెస్ట్‌ అని చెప్పవచ్చు. మ‌ల్లెపూల టీ నోటిలో వేసుకుని పుక్కిలిస్తే చిగుళ్ల స‌మ‌స్యలతో పాటు దంత సమస్యలు రావు. అంతేకాకుండా ఈ టీ వల్ల వృద్ధాప్య ఛాయ‌లు ఉండవు. కండ‌రాలు, కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. నీటిలో మ‌ల్లెపూలు వేసి గంట తర్వాత స్నానం చేస్తే శరీరంలోని దుర్వాసన పోతుంది. మ‌ల్లెపూలతో తీసిన నూనెతో మర్దనా చేస్తే కీళ్ల నొప్పులు పోతాయి. అంతేకాకుండా దీన్ని రాయడం వల్ల మొటిమ‌ల ద్వారా వచ్చిన మ‌చ్చలు పోతాయని నిపుణులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు