Alcohol Affects Brain: మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? మద్యం మెదడుపై ప్రభావం చూపుతుందని

చాలామంది సాధారణంగా మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. మద్యం తీసుకున్నప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్లు మెదడులో క్రియాశీలతను తగ్గిస్తాయి.. అప్పుడు ఆలోచించే విచక్షణ కోల్పోతారు. మద్యం మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Alcohol Affects Brain: మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? మద్యం మెదడుపై ప్రభావం చూపుతుందని

Alcohol affects the brain: మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరమని చాలామందికి తెలుసు. రోజూ మద్యం తాగితే ఆరోగ్యానికి మంచికాదని వైద్యులు ఎల్లప్పుడు చెబుతూనే ఉంటారు. అయినా.. మందుబాబులు మాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు లాగిస్తారు. కాగా.. మద్యం తాగితే.. ఆరోగ్యంతో పాటు మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఓ పరిశోధనలో వెల్లడించారు. ఆ పరిశోధన ప్రకారం మద్యం తాగిన తెల్లారి రోజు ఉదయం తలనొప్పి లేస్తుందని తెలిసిన విషయమే. అయితే అలా జరిగితే మనిషి యొక్క మెదడుకు తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

ఆలోచించే విచక్షణ కోల్పోతారు

తినేదైనా, తాగేదైనా ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. అయితే.. ఈ ఆల్కహాల్ తీసుకునే విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతోంది. ఎందుకంటే.. అతిగా మద్యం తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గి నాడులు దెబ్బతిని. గుండె కొట్టుకునే వేగం, శ్వాస క్రియ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు మద్యం ప్రభావం ఆఖరి దశ మరణానికి కూడా దారితీస్తుంది. రక్తంలో మద్యం మెతాదు పరిమితికి వచ్చాక మాటల్లో తేడా, నడకలోనూ మార్పు వంటి వస్తుంది. మద్యం ఎక్కువగా తీసుకుంటే కొంత సేపయ్యాక సోయి లేకుండా కిందపడిపోతారు. మెదడులో క్రియాశీలత బాగా తగ్గి ఆలోచించే విచక్షణ కోల్పోతారు.
ఇది కూడా చదవండి: మీకు ఎక్కువగా కోపం వస్తుందా..? నివారించాల్సిన ఆహారాలు ఇవే
ఇతర పదార్థాల కంటే మద్యం త్వరగా శరీరంలోకి వెళ్తుంది. దీని వలన జీర్ణాశయంలోకి మద్యం వెళ్లి సరిగా జీర్ణం కాదు దీంతో ఆల్కహాల్ రక్తంలో కలుస్తుంది. అంతేకాకుండా రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికీ చేరుతుంది. మద్యానికి అలవాటైన మనిషి యొక్క మెదడు సాధారణ పరిస్థితికి రావాలంటే.. కనీసం 7.3 నెలల సమయం పడుతుందని ఓ నివేదికిలో తెలిపారు. అయితే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే డిమెన్షియా, స్ట్రోక్, డిప్రెషన్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మద్యం యూజ్ డిజార్డర్ ఉంటే వ్యక్తులు వారి వల్కలం ప్రాంతంలో సన్నబడుతుంటారని తెలిపారు. అయితే.. మద్యపానం మానేసినప్పుడు మనిషి మెదడులోని కొన్ని ప్రాంతాలు కోలుకుంటారని పాత అధ్యయనాలు చెబుతున్నారు. అయితే.. ఈ న్యూస్‌ అవగాహన కోసంమే. ఈ మద్యం ప్రభావంపై స్పష్టమైన సమాచారాన్ని అందించలేకపోతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు