Haryana Govt: పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్స్ కు ముందు అనర్హురాలిగా ఐఓఏ వినేశ్ ఫోగాట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వినేశ్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె ఇక కుస్తీ పోటీలకు వీడ్కోలు చెప్పేసింది కూడా. అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్ లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేశ్ రెజ్లింగ్ కు వీడ్కోలు చెప్పేసింది.
కాగా..వినేశ్ ఫోగట్‌ను పతక విజేతగా స్వాగతిస్తామని, సత్కరిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే అన్ని సన్మానాలు, రివార్డులు, సకల సౌకర్యాలను వినేశ్ కి కూడా అందజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. వినేశ్ ఛాంపియన్ అని సీఎం సైనీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఇంతకుముందు.. ‘కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. రెజ్లింగ్‌కు గుడ్‌బై (2001-2024). నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి’ అని ఎక్స్‌లో వినేశ్ ఫోగాట్ రాసుకొచ్చారు.తన బరువు విభాగం (50కేజీ) కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉండటం వినేశ్‌ను నిరాశపరిచింది. కేవలం 100 గ్రాముల బరువు వల్ల ఆమె అనర్హతకు గురైంది. ఆ 100 గ్రాములు తగ్గించుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఐఓఏ అధికారులను ఎంత బతిమాలినా కూడా ఫలితం లేకుండాపోయింది. అయినా.. ఇప్పటికీ ఒలింపిక్ ఫైనల్ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. కనీసం రజతం ఖాయం చేసుకుని తనదైన గుర్తింపును నిలుపుకుంది.
Also read: క్రమశిక్షణా ఉల్లంఘన చర్యల కింద మరో క్రీడాకారిణి పై ఐఓఏ వేటు!