Republic Day:దేశవ్యాప్తంగా గణతంత్ర దినోవత్సం (Republic Day)ఘనంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య వివిధ రంగాలు చేసిన చేసిన ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో నారీశక్తి పేరుతో త్రివిధ దళాలు చేపట్టిన కవాతు చూపుతిప్పుకోకుండా చేశాయి. పలు రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు, ఆయ రాష్ట్రాల సంస్క్రుతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలుగా నిలిచాయి. వాయు విన్యాసానాలు తల ఎత్తుకునేలా చేశాయి. చివరగా ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేసి వేడుకలను ముగించారు. దేశంలోపలు రాష్ట్రాల్లోనూ గణతంత్ర వేడుకల ఘనంగా జరిగాయి.
కాగా హర్యానా(Haryana)లో గణతంత్ర వేడుకల సదర్బంగా ఆసక్తికర సంఘటన జరిగింది. రిపబ్లిక్ డే వేడుకల్లో శ్రీరాముడికి సంబంధించిన నృత్య ప్రదర్శనను మెచ్చుకున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar)ప్రొటోకాల్ ను బ్రేక్ చేసి మరీ ఆ కళాకారుల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా రామ, సీత, లక్ష్మణ వేషధారణలో ఉన్న ఆర్టిస్టులకు పాదాభివందనం(Kudos to the artists) చేశారు. అక్కడ ఉన్న ఇతర కళాకారులను సీఎం అభినందించారు. కర్నాల్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించారు ఖట్టర్ . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: ఈ స్కీంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే…వడ్డీలోంచి లక్షలు లెక్క పెట్టొచ్చు..!!