Manohar Lal Khattar : లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) ముందు హర్యానా(Haryana) ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.ఆయన మళ్లీ ఆ పదవి చేపట్టే అవకాశం లేదు. కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు బీజేపీ(BJP) ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నారు.నాయబ్ సింగ్ సైనీ సీఎం కావచ్చు. కొత్త సీఎం ఈరోజే ప్రమాణస్వీకారం చేయవచ్చని టాక్ వినిపిస్తుంది.
--> మనోహర్ లాల్ ఖట్టర్ సహా ఆయన మంత్రివర్గం రాజీనామా చేసింది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు తెగిపోయిన తర్వాత కూడా బీజేపీ స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
--> లోక్ సభ ఎన్నికల్లో సీట్లు డిమాండ్ చేసిన బీజేపీ.. జేజేపీ(JJP) నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 సీట్లు ఉన్నాయి.
-> హర్యానా ప్రభుత్వంలో గణనీయమైన మార్పులను బీజే అధిష్టానం పరిశీలిస్తోంది. రాజకీయ పరిణామాలను పర్యవేక్షించడానికి కేంద్ర బీజేపీ నాయకత్వం కేంద్ర మంత్రి అర్జున్ ముండా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ లను రాష్ట్రానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
--> కాసేపట్లో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఉంది. రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పడనుంది.
--> ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జేజేపీ-బీజేపీ కూటమి విచ్ఛిన్నమైందన్న వార్తల నేపథ్యంలో ఈ రాజకీయ దుమారం రేగింది. డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా బీజేపీ ముందు ఉంచిన డిమాండ్‌ను అంగీకరించలేదని జేజేపీ వర్గాలు తెలిపాయి.
--> కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో దుష్యంత్ చౌతాలా భేటీ అయ్యారు. దుష్యంత్ చౌతాలా తన పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీలోని తన నివాసానికి పిలిపించారు. అయితే జేజేపీ ఎమ్మెల్యేలు తెగిపోతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో చూడాలి.
Also Read : మా రాష్ట్రంలో సీఏఏ అమలు చేయము..కేరళ సీఎం సంచలన ప్రకటన
Updated soon...