Director Harish Shankar : రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ హరీష్ శంకర్ పై భారీగానే విమర్శలు వచ్చాయి. ఆయన్ని నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయితే తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ కు హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు.
‘మిస్టర్ బచ్చన్’ సినిమా విశేషాలు పంచుకోవడం కోసం ఆయన తాజాగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఇందులో మిస్టర్ బచ్చన్ నెగిటివ్ టాక్ పై మాట్లాడుతూ.." గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలకు వచ్చిన స్పందనలు నన్ను నిరాశపరిచాయి. కానీ, ఆ దర్శకుల మీద లేని అటాక్ నాపై జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు.
Also Read : హిట్లర్, ఒరేయ్ రిక్షా, రాఖీ.. తెలుగులో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలివే!
ఇందులోని ఒక డ్యాన్స్ మూమెంట్‌ను ప్రధానంగా తీసుకొని విమర్శిస్తున్నారు. కానీ, ఇందులో మంచి డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదు. ‘కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క’ అని రాశాను. దాన్ని పక్కన పెట్టేశారు. ఆ డైలాగు అమ్మాయిలకు చాలా నచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పారు.
అలాగే హీరో ఓ సందర్భంలో హీరోయిన్‌తో ‘నీకు నా ప్రేమ అర్థమయ్యేవరకు నిన్ను కదిలించను’ అంటాడు. అమ్మాయిలు ఏ విషయంలోనైనా ‘నో’ చెబితే వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగు రాశాను. దీనిగురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కనబెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నారు.