ప్రధాని మోదీకు హరీష్‌రావు ఘాటుగా కౌంటర్

ప్రధాని మోదీకు హరీష్‌రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ముందు మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వండన్నారు. కేసీఆర్‌ని తిట్టడానికి ఢిల్లీ నుంచి గల్లీకి వస్తున్నారా? అని మండిపడ్డారు. మా పథకాలు కాపీ కొట్టి..మాకు రావాల్సిన నిధులు రాకుండా చేశారు. మోదీకి తిట్టడం తప్ప అభివృద్ధికి సహకరించట్లేదన్నారు. మీకు రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే గిరిజనులకు యూనివర్సిటీని ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు

New Update
ప్రధాని మోదీకు హరీష్‌రావు ఘాటుగా కౌంటర్

HarishRao sharp counter to Prime Minister Modi

అవార్డులు ఢిల్లీలో.. తిట్లు గల్లీలోనా...

ప్రధాని నరేద్ర మోదీకి మంత్రి హరీష్‌రావు ఘటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా సీఎం కేసీఆర్‌ని తిడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వేరే పని లేక తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ని ఇష్టం వచ్చినట్లు అంటున్నారని మండిపడ్డారు.మొన్న రాహుల్ వచ్చిన, ఈరోజు మోదీ వచ్చినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టి.. ప్రతి పథకం పేరు మార్చి కాపీ కొట్టారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యనించారు.

కావాలనే వేల కోట్లు ఆపేశారు

మేము పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు?..ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని ప్రశ్నించారు. పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయని ప్రధాని మోడీ అంటున్నారు. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం మీరు ఏం చేశారని అన్నారు. తెలంగాణకి చాలా నిధులు ఇచ్చామని ప్రధాని అంటున్నారు.. మీరు డబ్బులు ఇవ్వలేదు..మాకు రావాల్సిన నిధులు ఆపాటం ఇది నిజం కాదున్నారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే మాకు రావాల్సిన డబ్బులు మకు ఇవ్వండి అంటూ సవాల్‌ చేశారు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదు కానీ..బావుల కాడా మీటర్లు పెట్టాలేదనీ 21 వేల కోట్లు ఆపింది మీరు కాదంటూ మండిపడ్డారు.

ప్రజల అండ మాకు ఉంది

తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కళ్ళలో మంటలు లేస్తున్నాయని అన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి.. అంతే కాదు కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు..బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకూండా బురద జల్లుడు తప్ప మీరు చేసేందేమి లేదని ఘటుగా విర్శించారు. ఏమన్నా అంటే ఈడీ ఉపయోగిస్తున్నారు.. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండవచ్చు, కానీ మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని మంత్రి హరీష్‌రావు అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు