Harish Rao: ఇదేం పద్ధతి.. రేవంత్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్!

TG: ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు హరీష్ రావు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అని ధ్వజమెత్తారు.

New Update
Harish Rao: ఇదేం పద్ధతి.. రేవంత్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్!

Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? అని నిలదీశారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాదులో కరెంట్ కోతలు..

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరెంట్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనం అని హరీష్ రావు అన్నారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్‌, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరువయ్యారని చెప్పారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisment
తాజా కథనాలు