సీఎం పదవి ఇవ్వటానికి వారసులు ఎవ్వరు?

ఏపీలో పొలిటికల్ రగడ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలతో ఏపీ రాజకీయాలు హిట్‌గానే ఉంటోంది. తాజాగా లేఖల రగడ నడుస్తోంది. ఎక్కడైనా అధికారంలోకి రావడానికి కొన్ని డిమాండ్లను ప్రకటిస్తారు.. కానీ ఇక్కడ మాత్రం లేఖలతో సవాళ్ల పర్వం ప్రకటిస్తున్నారు.

New Update
సీఎం పదవి ఇవ్వటానికి వారసులు ఎవ్వరు?

Harirama Jogaiahs letter to Jagan

లేఖల పర్వం..

ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతూనే ఉంది.. ఓవైపు యాత్రలు, పాదయాత్రలు, సభలు, సమావేశాల వేదికగా సవాళ్ల పర్వం, ఆరోపణలు, విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు లేఖల యుద్ధం కూడా సాగుతూనే ఉంది.. సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మరోసారి సీఎం జగన్‌కి బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం జగన్‌తో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి లేఖలు రాసిన ఆయన.. ఈ సారి జగన్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు.

దోషిగా ప్రకటిస్తే..!

మీపై సీబీఐ, ఈడీ విచారణ చేసి క్విడ్‌ప్రోకో కింద, మనీ ల్యాండరింగ్‌ కింద సీబీఐ 11 కేసులు, ఈడీ 6 కేసులు బనాయించాయి. 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.. కానీ, ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల్లో సీబీఐ కోర్టులో ఇంకా విచారణలో ఉన్నాయి. కోర్టులు ఏ కారణం చేతైనా మిమ్మలను దోషులుగా ప్రకటిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. మీ వారసులుగా రెడ్డి కులస్తులను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా..? లేక కాపు బడుగు బలహీన వర్గాల వారిని వారసులుగా ప్రకటిస్తారా? ఈ విషయాన్ని చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చెబితే..గర్వపడతాం..

దీని ద్వారా బడుగు బలహీన వర్గాలపై మీకున్న కమిట్‌మెంట్‌ చూసి గర్వపడతామని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు
 హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు