పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్

'హరిహర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. కొత్త షెడ్యూల్ వార్ సీక్వెన్స్‌తో మొదలు కానుందని తెలిపారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్
New Update

HariHara Veeramallu Movie : గత కొన్ని నెలలుగా రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మేకప్ వేసుకొని షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. మొదటగా ‘హరిహర వీరమల్లు’ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తాజాగా షూటింగ్‌ను మొదలుపెట్టింది.

కొత్త షెడ్యూల్ వార్ సీక్వెన్స్‌తో మొదలు కానుందని మేకర్స్‌ తెలియజేశారు. ఈ వార్ సీక్వెన్స్‌ లో 400 నుంచి 500 మంది యుద్ధ సాధకులు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్లు సమాచారం. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ స్టంట్ సెల్వా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారు. కాగా షూటింగ్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది? పవన్ కల్యాణ్‌ ఎప్పుడు షూట్‌లో జాయిన్ అవుతాడనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ-2’

పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అర్జున్ రాంపాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

#pawan-kalyan #harihara-veeramallu-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe