ఆసీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్?

ఆసీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు హర్దిక్ పాండ్యా దూరమైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడిన హర్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, మరికొన్ని రోజులు రెస్ట్ కావాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. అలాగే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కూడా హర్దిక్ ఆడటం డౌటే.

New Update
ఆసీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్?

Hardik Pandya: ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ కు దూరం కానున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ స‌మ‌యంలో బౌలింగ్ చేస్తుండగా కాలి మ‌డిమకు గాయం కావ‌డంతో అత‌ను తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో వరల్డ్ కప్ (World Cup) టోర్నీ మొత్తానికి దూరమైన హర్దిక్ ను త్వరలో జరగబోయే ఆసీస్‌తో పాటు సౌతాఫ్రికా సిరీస్‌ నుంచి కూడా తప్పించినట్లు సమాచారం.

ఈ మేరకు వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌లో (Australia T20 series) ఆడేందుకు ఫిట్ గా లేడు. కాలి మ‌డిమకు అయిన గాయం ఇంకా తగ్గలేదు. వైద్యులు మరిన్ని రోజులు రెస్ట్ కావాలని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు సిరీస్ ల నుంచి తప్పిస్తున్నట్లు టీమ్ సభ్యుడొకరు ఓ సమావేశంలో చెప్పినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక హర్దిక్ (Hardik Pandya) గాయపడగానే బ్యాకప్ బౌలర్ గా ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ను వరల్డ్ కప్ లోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ టోర్నమెంట్ ముగియగానే ఆస్ట్రేలియా తో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, సౌతాఫ్రికాతో మూడు టీ20, మూడు వ‌న్డేలు ఆడనుంది భారత్.

Also read :IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!

ఇక వరల్డ్ కప్ విషయానికొస్తే.. నవంబర్ 19న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. 20 సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో (World Cup Final) తలపడనున్నాయి. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‍లో టీమిండియాపై గెలిచిన ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి కప్ గెలిచింది. అయితే ఈసారి సొంతగడ్డ పై భారత్ గెలిచి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఫాన్స్ నమ్మకంతో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు