T20 Rankings : ICC T20 ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా హార్దిక్ పాండ్యా.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు!

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండ‌ర్‌గా నిలిచాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు.

New Update
T20 Rankings : ICC T20 ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా హార్దిక్ పాండ్యా.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు!

Hardik Pandya Becomes No.1 All Rounder: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో (ICC T20 Rankings) సత్తా చాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండ‌ర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. ఇక తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మార్కస్‌ స్టాయినిస్‌ (ఆస్ట్రేలియా), సికిందర్ రజా (జింబాబ్వే), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌) ఒక్కో స్థానం మెరుగై వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

అఫ్గానిస్థాన్‌ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోయాడు. కాగా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌-2024లో హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తన ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి.. భారత్‌ రెండో సారి టీ20 వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం టోర్నీలో 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 11 వికెట్లు తీసి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు.

Also Read : టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కూడా కోహ్లీ సాధించాలి..ద్రవిడ్!

ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియా ఏడు స్థానాలు ఎగబాకి రెండో స్థానం దక్కించుకున్నాడు. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానంలో, కుల్‌దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగై ఎనిమిదో స్థానంలో నిలిచారు. టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలవడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు