Hanuman Review: కొత్త ఆవకాయలా ఇంటిల్లిపాదీ మెచ్చే సూపర్ హీరో హను-మాన్!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా పిల్లల దగ్గర నుంచి పెద్దలవరకూ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. సినిమాకి సమబంధించిన పూర్తి రివ్యూ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి

Movies:నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్
New Update

Hanuman Review: సినిమా ఎందుకు చూస్తారు? ఈ ప్రశ్నకు అందరూ చెప్పే సమాధానం వినోదం కోసం. కానీ, అన్నీ సినిమాలూ వినోదాన్ని పంచుతాయా? కచ్చితంగా ఔను అని చెప్పలేం. అసలు వినోదం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే.. దానికి సమాధానం మాత్రం వ్యక్తులను బట్టి మారిపోతుంది. అందుకే అన్నీ సినిమాలు అందరికీ నచ్చవు. ఇది పిల్లల సినిమా.. అది పెద్దల సినిమా.. అబ్బా ఏమి కామెడీ సినిమా ఆండీ బాబూ.. ఈ సినిమాలో యాక్షన్ అదిరిందండీ.. ఇలా ఒక్కొరూ ఒక్కోరకంగా సినిమా వినోదానికి భాష్యం చెబుతారు. కానీ, ఒక్కోసారి వస్తాయి.. వీటన్నిటినీ సమానంగా కలిపి.. పిల్లా పాపాలతో సహా.. ఇంటిల్లిపాదినీ కుర్చీల్లో కట్టిపాడేసి రెండున్నర గంటల పాటు ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే సినిమాలు. హీరో.. హీరోయిన్.. స్టార్ డమ్.. ఇంకొరకమైన దమ్ము ఇలాంటివి ఏమీ లేకుండా.. వస్తాయి. అదిగో సరిగ్గా అలాంటి సినిమా.. సంక్రాంతికి మూడు రోజుల ముందుగానే థియేటర్లలో ప్రేక్షకులు పండగ చేసుకునేలా.. వచ్చేసింది హనుమాన్.(Hanuman Review)

నిజానికి నెల రోజులుగా ప్రతి రోజూ సినిమా వార్తల్లో.. సోషల్ మీడియాలో.. విపరీతంగా ట్రెండింగ్ లో ఉన్న సినిమా ఏదైనా ఉందీ అంటే అది హనుమాన్. చిన్న సినిమాగా ముద్ర వేసుకుని.. ఈ తెదీకే వస్తాను అని చెప్పి.. వెనకడుగు వేయకుండా.. పెద్ద సినిమాలను మించిన బజ్ తో వచ్చిన సినిమా హనుమాన్(Hanuman Review). శుక్రవారం సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఒకరోజు ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియార్లతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను అందుకుందా? Hanuman Review చెప్పేసుకుందాం రండి.

ప్రతి సంవత్సరం కొత్త ఆవకాయ తింటారు కదా.. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త ఆవకాయ రుచి అప్పుడే మొదటిసారి తింటున్నట్టు కొత్తగా అనిపిస్తుంది కదా.. అదిగో సరిగ్గా అలాంటి సినిమా హనుమాన్(Hanuman Review). సగటు సినిమాలలాంటి కథే.. కానీ.. కథనమే ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. విలన్.. హీరో.. ప్రేమ.. సెంటిమెంట్.. వీటికి సూపర్ హీరో ఎలిమెంట్ జత చేసి.. ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్ది కొత్త ఆవకాయ లాంటి సినిమా సిద్ధం చేసి.. దానిలో ఘుమ ఘుమలాడే నెయ్యి లాంటి గ్రాఫిక్స్ కలబోసి.. వేడి వేడి అన్నం లాంటి బీజీఎం తో కలిపి వెండి అరిటాకులో పెట్టి ప్రేక్షకులకు కనువిందు చేశాడు ప్రశాంత్ వర్మ. ఒక సామాన్యుడికి సూపర్ పవర్ వస్తే.. తనకు తెలియకుండానే సూపర్ హీరో అయిపోతే.. ఒక విలన్ సూపర్ హీరో నుంచి ఆ పవర్ తీసుకోవడం కోసం దండయాత్ర మొదలు పెడితే.. దానిని హీరో ఎలా ఎదుర్కున్నాడు? సూపర్ హీరోగా ఎలా నిలిచాడు? ఇదే సినిమా. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు చాలా చూశాం. ఇది టాలీవుడ్ నుంచి.. భారతీయ ఆధ్యాత్మికతను జోడించి తీసిన హాలీవుడ్ రేంజ్ మూవీ(Hanuman Review) ఇది.

సినిమా అంతా దర్శకుడిదే. ప్రశాంత్ వర్మ సీన్ బై సీన్ సెల్యులాయిడ్ మీద పరిచిన విధానం చాలా బాగుంది. తాను ఎలా సినిమా తీశానని ప్రమోషన్స్ లో చెప్పుకుంటూ వచ్చాడో.. అంతకు మించి సినిమాలో అతని ప్రతిభ కనిపించింది. గ్రాఫిక్స్ వాడుకున్న విధానం.. వాటిని ఎక్కడ ఎలా చూపించాలో అలా చూపించి మెస్మరైజ్ చేశాడు. తేజా సజ్జా.. ఇరగదీశాడు అని చెప్పాలి. ఇక సినిమాకి వరలక్ష్మి శరత్ కుమార్ పెద్ద ఎసెట్.. సినిమాలో ఒక పక్క గ్రాఫిక్స్.. మరో పక్క ఎలివేషన్స్.. వీటి మధ్యలో అలా వచ్చి పోతుండే కామెడీ.. అబ్బే ఇది చాలదన్నట్టు సెంటిమెంట్ ఎపిసోడ్ వీటన్నిటినీ అంతర్లీనంగా కలిపి ఉంచే హనుమాన్ భక్తిరసం.. అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ కుటుంబం అంతా కలిసి చూడాల్సిన సినిమా(Hanuman Review) తీసుకు వచ్చాడు ప్రశాంత్ వర్మ.

సినిమాలో నటీనటులు ఒక్కొక్కరి గురించి చెప్పుకోవడం కన్నా.. అందరూ తమ పనిలో నూటికి నూరు పాళ్ళు లీనం అయిపోయారని చెబితే సరిపోతుంది. ఇక టెక్నికల్ గా సినిమా (Hanuman Review)గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. గ్రాఫిక్స్.. హనుమంతుడి సెట్టింగ్స్.. వీటిని తెరపైకి తీసుకువచ్చిన కెమెరా పనితనం.. వీటిని ఎలివేట్ చేసేలా అదరగొట్టిన నేపధ్య సంగీతం.. మెస్మరైజ్ చేశాయి. సినిమా చివరి 20 నిమిషాలూ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ తో అందరూ బయటకు వస్తారు.

Also Read: స్టన్నింగ్ లుక్స్ లో శ్రుతి హాసన్‌

పెద్ద హీరోనా.. చిన్న హీరోనా.. పెద్ద సినిమానా.. చిన్న సినిమానా అని కాదు.. అందరికీ వినోదాన్ని ఇచ్చిందా లేదా అనేదే ముఖ్యం ఇది ఒప్పుకుంటారు కదా.. అయితే, హనుమాన్ దానిలో సూపర్ సక్సెస్ అయింది. ఏ మాత్రం సంకోచం లేకుండా ఇంటిల్లిపాదీ వెళ్ళి రెండున్నర గంటల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేయగలిగే పండగ సినిమా(Hanuman Review) హనుమాన్.

చివరిగా మనలో మనం చెప్పుకోవాల్సిన మాట.. సూపర్ హీరో అంటే బలంతో గెలిచేవాడు కాదు.. ఆపదలో ఉన్న వారికోసం ఏమైనా చేసేవాడు.. ఇదే సినిమా చెబుతుంది. సినిమా టీం కూడా పండక్కి నేరుగా అలాంటి సందేశాన్ని చాలామందికి ఇచ్చినట్టే అనిపిస్తోంది సుమండీ.. అన్నట్టు.. పచ్చి పచ్చిగా గిలిగింతలు పెట్టే మాస్ మసాలా సీన్స్.. ఎగిరెగిరి పడే హీరో, హీరోయిన్ల పాటలు.. ఒక్క డైలాగ్ తో వంద మరో రకం అర్ధాలు స్ఫురించే మాటలు కావాలంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళకండి.

సినిమా: హను-మాన్ , నటీనటులు: తేజా సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, సత్య తదితరులు. కథ స్క్రీన్ ప్లే: స్క్రీన్ విల్లె, కెమెరా: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: సాయిబాబు తలరి, సంగీతం: అనుదీప్ దేవ్, రచన-దర్శకత్వం: ప్రశాంట్ వర్మ

#tollywood #movie-review
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe