Hanuman Jayanti 2024 : మంగళవారం హనుమాన్ జయంతి కాదు.. హనుమాన్ విజయోత్సవం.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? హనుమాన్ విజయోత్సవాన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఎందుకో తెలుసా? హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతికి విజయోత్సవానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Bhoomi 21 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Hanuman Jayanti 2024 : ప్రతిఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి(Poornima) రోజు హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) అనే హడావుడి అంతా ఇంతా కాదు. మరికొంతమంది వైశాఖ మాసంలో కదా హనుమాన్ జయంతి అని ప్రశ్నిస్తుంటారు. ఇంతకు ఆంజనేయుడి జన్మతిథి చైత్రమాసంలోనా? వైశాఖంలోనా? దీనికి క్లారిటీ కావాలంటే హనుమాన్ విజయోత్సవం, హనుమాన్ జయంతి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలుసుకోవాలి. హనుమాన్ విజయోత్సవం -2024 ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం హనుమాన్ జయంతి -2024 జూన్ 01 శనివారం వైశాఖ మాసంలోనే ఎందుకు హనుమాన్ జయంతి జరుపుకుంటారు? అంజనాకేసరుల కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారం కోసం రామ కార్యనిర్వహణకు ఉదయించాడు. పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవి(Anjana Devi) గా జన్మించింది. శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమై హనుమంతుడు అంతరించాడు. హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత ప్రకారం.. హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం, మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నం..కౌండిన్యస గోత్రములో జన్మించాడని ఉంది. అందుకే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలి. చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవం: వైశాఖంలో వచ్చేది హనుమాన్ జయంతి అయితే... చైత్ర మాస పౌర్ణమి రోజును కూడా హనుమాన్ జయంతి అని ఎందుకు అంటారనే సందేహం చాలా మందిలో కలగవచ్చు. దానికి కారణం ఏంటంటే హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడను వెతకడం, వారధి నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకువచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడ. ఈవిధంగా రాముడు అయోధ్యకు చేరుకునేవరకూ అడుగడుగునా శ్రీరాముడి విజయం వెనక భక్తుడు హనుమంతుడు ఉన్నాడు. అందుకే అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం ఘట్టం ముగిసిన అనంతరం రాముడు ఇలా అనుకున్నాడట. హనుమంతునిసేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది. నేను తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను. ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం, ఆనందం అన్నీ హనుమంతుడి వల్లే సాధ్యం అయ్యాయని ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడట రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్న రాజ్య ప్రజలు అప్పటి నుంచి శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను గుర్తుపెట్టుకుని హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ హనుమాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు.అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమాన్ పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన హనుమంతునికి నమస్కరిస్తున్నాని అర్థం. ఇది కూడా చదవండి: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు #hanuman-jayanti-2024 #hanumanth-vijayotsavam-2024 #poornima #anjana-devi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి