BRS OFFICE: కేసీఆర్‌కు బిగ్ షాక్‌.. బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు నోటీసులు!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ మున్సిపాల్టీ యాక్ట్‌ 2019 సెక్షన్‌ 254 కింద హన్మకొండ బీఆర్ఎస్ ఆఫీసులు నోటీసులు పంపించారు అధికారులు. భవన నిర్మాణ అనుమతి, భూమి కేటాయింపు కాపీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు కలెక్టర్.

BRS OFFICE: కేసీఆర్‌కు బిగ్ షాక్‌.. బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు నోటీసులు!
New Update

Notice To BRS Office: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు (KCR) వరుస షాకులు తగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ మున్సిపాల్టీ యాక్ట్‌ 2019 సెక్షన్‌ 254 కింద హన్మకొండ (Hanamkonda) బీఆర్ఎస్ ఆఫీసులు నోటీసులు పంపిచారు అధికారులు. బీఆర్ఎస్ ఆఫీస్‌ కేటాయింపు కాపీలు వెరిఫికేషన్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతి, భూమి కేటాయింపు కాపీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు. బీఆర్ఎస్‌ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌కు సైతం ఈ ఇష్యూలో మున్సిపల్ అధికారులు నోటీసులు పంపించారు. ఈ భవనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ సమర్పించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆఫీసును (Nalgonda BRS Office) కూల్చేయాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులకు కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని, వెంటనే దీనిపై యాక్షన్ మొదలుపెట్టాలంటూ నల్గొండ కలెక్టర్ కు సూచించారు. గవర్నమెంట్‌ ఆసుపత్రిలో కోట్లు విలువచేసే ప్రభుత్వభూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్‌ పర్మిషన్‌ లేకుండా కట్టారు. అసలు రూల్స్‌ ప్రకారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎప్పుడో కూలగొట్టాలే.నేను చెప్పలే, చెప్తే ఎప్పుడో కూలగొడుతుండే. ఆఫీసుకు పర్మిషన్‌ ఉన్నదా?పేదలు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మించారని అన్నారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ తెలుపగా.. దానిని వెంటనే కూల్చివేయాలని అన్నారు. మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పారు.పర్మిషన్‌ తీసుకొని కట్టుకుంటే ఏమనేవాళ్లం కాదు. నిబంధనల ప్రకారం కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉమెన్స్‌ హస్టల్‌, మరేదైన ప్రభుత్వ కార్యాలయం నిర్మించే అవకాశం ఉంటుందని తెలిపారు వెంటనే దాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. 

Also Read: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్‌దే అధికారం.. ఎన్టీఆర్‌కు ఇలాగే జరిగింది: కేసీఆర్

#kcr #cogress #hanumakonda-brs-office
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe