బయటకు రాని పరిస్థితి
జిల్లాలో కూడా ఈ వానలు దంచికోడుతున్నాయి. ఆగని వానలతో ఇప్పటికే వరదలతో చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. కొన్ని చెరువులు మరమ్మతులకు నోచుకోక కట్టలు బలహీనంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల చిన్నచిన్న బుంగలు పడి కట్టలు లీకేజీ అవుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మంగళవారం నుండి మరో సారి భారీ నుంచి అతిభారి వర్షాలు కురవడంతో పరకాల నియోజకవర్గంలోని పలు గ్రామాలు పరకాల పట్టణం నీటితో నిండి జలమయమయ్యాయి. ఇవాళ (గురువారం) ప్రజలు ఇంటి నుండి బయటకు రాని పరిస్థితి ఎదురైంది. పరకాల పట్టణంలోని శ్రీనివాస కాలనీ మమతానగర్ ఇళ్లలోకి నీరు వచ్చి ఇంట్లో నుండి ప్రజలు బయటకు రాని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా భూపాలపల్లి పరకాల మెయిన్ దారిలో చలివాగు పొంగిపొర్లుతుండడంతో పరకాల భూపాలపెళ్లి దారి జలదిగ్బంధంలో చిక్కుకుంది.
ఇండ్ల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూపు
ఇకా పరకాల అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు వెళ్లే దారిలో నీరు ఇండ్లలోకి వచ్చి నిత్యవసర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. పరకాల మండలంలోని నాగారం గ్రామంలో పైడిపల్లి చెరువు కట్ట తిరిగి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో పైడిపల్లి గ్రామస్తులు భయాందోళనలో చెందుతున్నారు. నడికూడా మండలంలోని నార్లాపూర్ వాగు పొంగిపొర్లుతుండడంతో దళిత కాలనీ జరదిగ్బంధంలో మునగడంతో ప్రజలు సమీపంలో ఉన్న ఇండ్ల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కంటాత్మకూర్ హనుమకొండకు వెళ్లే దారిలో వాగులు పొంగిపొర్లుతుండడంతో పరకాల వయా అంబాల హనుమకొండ ప్రధాన రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అటువైపు వెళ్లొద్దని గ్రామస్తులు సూచిస్తున్నారు.
పోలీసుల హెచ్చరికలు
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులకు సెలవులు రద్దు చేసి.. స్థానికంగా ఉండాలని ఆదేశించారు. చెరువులకు ముప్పు ఏర్పడే ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నాం. తక్షణం మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని వారు వెల్లడించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం ఆత్మకూరు చెరువు పొంగిపొ ర్లుతున్నాయి. దానితో ములుగు జిల్లాకి రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు.