Hanmakonda: ఇంజక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి

ఇంజక్షన్‌ వికటించి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ హసన్ పర్తిలో బీఏఎంఎస్ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్‌తో ఈ దారుణం జరిగింది.

Hanmakonda: ఇంజక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి
New Update

వైద్యం కోసం వెళ్లితే.. ప్రాణాలు పోయే..

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని బీఎఎంఎస్ వైద్యుడు సముద్రాల శంకర్ ఆస్పత్రికి సోమవారం నేదునూరి సారయ్య వైద్యం కోసం వచ్చినాడు. సారయ్యను డాక్టర్ శంకర్ పరీక్షించి ఇంజక్షన్లు ఇచ్చినాడు. అంతలోనే సారయ్య అస్వస్థకు గురయ్యాడు. ఇది గమనించిన డాక్టర్ 108 వాహనమునకు ఫోన్ చేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించినాడు. ఎంజీఎం ఆస్పత్రి వెళ్లగానే సారయ్య మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

This browser does not support the video element.

డేట్ ఎక్స్‌పైర్‌ మందులతో వైద్యం

బీఎఎంఎస్ సముద్రల శంకర్ ఇచ్చిన ఇంజక్షన్ల తోనే మృతి చెందాడని హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని హసన్ పర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రోజున డిప్యూటీ డీఎంహెచ్‌వో మదన్ మోహన్, డాక్టర్ శ్రీవాణి, హసన్ పర్తి సీఐ తుమ్మ గోపి, ఎమ్మార్వో చల్ల ప్రసాద్ శంకర్ ఆస్పత్రిలో తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో డేట్ ఎక్స్‌పైర్‌ మందులు లభించాయని డీఎంహెచ్‌వో తెలిపారు. శంకర్ ఆస్పత్రి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ ఉందని బీఏఎంఎస్ చదివిన శంకర్ వైద్యం చేస్తున్నాడని.. బీఎంఎస్ చదివిన డాక్టర్ శంకర్‌కు ఇంజక్షన్లు ఇచ్చే అధికారులు లేవని తెలిపారు. అనంతరం ఆస్పత్రిని సీజ్ చేశారు.

This browser does not support the video element.

గతంలో ఇలాంటి ఘటన

అయితే గత ఏప్రిల్ నెలలో సముద్రాల శంకర్ ఆస్పత్రిలో హసన్ పర్తి గ్రామానికి చెందిన మీసర కొండ అవినాష్ 12 సంవత్సరాలు బాలుడు జ్వరం వచ్చిందని ఆస్పత్రికు వస్తే ఇంజక్షన్ ఇవ్వగానే అస్వస్థకు గురై మరణించినాడు బాలుని తల్లిదండ్రులు హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రిని తనిఖీ చేసి సీల్‌ చేశారు. కొద్ది రోజులకే అనధికారికంగా వేసిన సీలు తీసి ఆస్పత్రిలో వైద్యం నిర్వహిస్తున్నాడు. సోమవారం రోజున నేదునూరి సారయ్యకు ఇంజక్షన్లు ఇవ్వగానే అస్వస్థకు గురై ఏంజీఎంలో మరణించినాడు. జిల్లా వైద్య అధికారులు వేసిన సీలు అనధికారికంగా తీసినప్పుడే వైద్యాధికారులు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ మరణం సంభవించేది కాదని గ్రామ ప్రజలు అరోపిస్తున్నారు.

This browser does not support the video element.

#hasanparthi-mandal #hanmakonda-district #retired-constable #dies-due #injection-failure
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe