Hamas vs Israel: పాలస్తీనా గ్రూప్ హమాస్ గాజా నుండి ఇజ్రాయిల్‌పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతోంది. వందలాది మంది పౌరుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. ఈ మెరుపు దాడిలో భారిపెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దాడి సమయంలో ఇజ్రాయిల్ సైనికులు, పౌరులు, ముఖ్యంగా మహిళలను హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లారు. వీరిలో కొందరు సజీవంగా ఉన్నారని, మరికొందరు చనిపోయారని భావిస్తున్నట్లు మిలిటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ తెలిపారు.
ఇజ్రాయిల్ వార్ రూమ్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో.. యుద్ధం నేపథ్యంలో హమాస్ చేత కిడ్నాప్ చేయబడిన స్త్రీలు, పురుషుల ఫోటోలను షేర్ చేసింది. ‘‘హమాస్ ఎక్కువగా మహిళలను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మహిళలను అపహరించి అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ఈ అనాగరికుల పట్ల కనికరం చూపకూడదు.’ అంటూ తప్పిపోయిన వారి ఫోటోలతో పాటు.. హమాస్ దుశ్చర్యపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ క్యాప్షన్ పెట్టారు.
చాలా మంది ఇజ్రాయిల్‌లు హమాస్ మిలిటెంట్ల చెరకు చిక్కినట్లు బాధితుల కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితులు చెబుతున్నారు. బాధితుల ఫోటోలను కూడా పంపుతున్నారు. తప్పిపోయిన వారి బంధువుల డీఎన్‌ఏ శాంపిల్స్ తీసుకునేందుకు వీలుగా వారికి సంబంధించిన వస్తువులను అధికారులకు అప్పగిస్తున్నారు ప్రజలు.
ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. బందీల బాధ్యత హమాస్‌దేనని, ఒకవేళ వారికి హానీ కలిగిస్తే ప్రతిఫలం తప్పక అనుభవించాల్సి ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయిల్ జాతీయుల సంఖ్య భారీగా ఉందని ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ తెలిపారు. ఇవి ఇజ్రాయిల్‌ను కలవరపెట్టే దృశ్యాలని, రక్తదాహంతో ఉన్న ఈ జంతువుల చేతిలో ఇజ్రాయిల్ పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకుంటేనే భయంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
వీరి ప్రకటన ఇలా ఉండగానే.. ఇజ్రాయిల్ బందీల సంఖ్య నేతన్యాహు ప్రకటించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని హమాస్ మిలిటెంట్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. అంతకు ముందు శాంతి ర్యాలీలో పాల్గొన్న ఓ యువతి(25)ని హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. తనను చంపొద్దంటూ యువతి వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.
మరోవైపు ఇజ్రాయిల్ భద్రతా బలగాలు హమాస్ చేతిలో బందీలుగా ఉన్న పౌరులను, సైనికులను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది. కాగా, ఇప్పటి వరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనేది అధికారికంగా తెలియడం లేదు. మీడియా కథనాల ప్రకారం అయితే, హమాస్ దాడిలో దాదాపు 600 మంది ఇజ్రాయిల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 2 వేల మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
Also Read:
ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!
Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!