Boat Accident: బోటులో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది దుర్మరణం!

హైతీలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 80 మంది శరణార్థులతో వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. 40 మంది దుర్మరణం చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 41 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.

Boat Accident: బోటులో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది దుర్మరణం!
New Update

Haiti: హైతీలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 80 మంది శరణార్థులతో వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 40 మంది మంటలు అంటుకుని దుర్మరణం చెందారు. 11 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మరో 41 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది. మూడు రోజుల క్రితం హైతీ నుంచి బోటు బయల్దేరగా.. కాయ్ కోస్, టర్క్స్‌కు పడవ వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.





#boat-fire-accident #haiti #40-dead
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe