Gray Hair: చిన్న వయసులోనే జుట్టు నెరవడం లేదా నెరిసిపోవడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. ఈ రోజుల్లో కొందరికి 20 ఏళ్లు నిండకుండానే జుట్టు నెరిసిపోవడం, చిన్నప్పటి నుంచి జుట్టుకు హెయిర్ కలర్ రాసుకుంటూ ఉంటారు. వెంట్రుకలు నెరిసిపోవడం అనేది వయసు పెరగడానికి సంబంధించిన ప్రక్రియ కాబట్టి చిన్నవయసులోనే ఎప్పుడైతే నెరిసిపోతుందో అప్పుడే శరీరంలో అంతా సరిగ్గా జరగడం లేదని, ఏదో ఒక సమస్య వల్ల ఇలా జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు.
జుట్టు బూడిద రంగులోకి ఎందుకు మారుతుంది?
- ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పోషకాహార లోపం వల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. అలాగే ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుంది. జుట్టు సంరక్షణ కోసం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు కలవడం వల్ల జుట్టు రంగు మారుతుంది. అంతేకాకుండా సిగరెట్లు తాగడం వల్ల కూడా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఎక్కువ సేపు ఎండలో ఉన్నా జుట్టు దెబ్బతింటుంది, అంతేకాకుండా వారసత్వంగా కూడా జుట్టు రంగు మారుతూ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు త్వరగా బూడిద రంగులోకి మారుతుందని చెబుతున్నారు. మన తాత ముత్తాతల వెంట్రుకలు ముందుగా నెరిసిపోతే ఆ తర్వాతి తరాల జుట్టు కూడా కాలానికి ముందే నెరిసిపోతుందని చెబుతున్నారు.
హార్మోన్ల అసమతుల్యత:
- శరీరంలోని హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా జుట్టు ఆకృతిని దెబ్బతీస్తాయి. అలాగే జుట్టు బూడిద రంగులోకి మారుతుంది.
హార్మోన్ల అసమతుల్యతను నివారించే చిట్కాలు:
- ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినాలి, గుడ్లు, అవకాడో, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి,దీని కారణంగా జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఆకు కూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బరువును కూడా కంట్రోల్‌లో ఎంచుకోవాలి, ఎందుకంటే అధిక బరువు మన శరీర పనితీరును దెబ్బతీస్తుంది. హార్మోన్ల స్థాయిలు కూడా అసమతుల్యతగా మారుతాయి.
జుట్టు కోసం ఆహార చిట్కాలు:
- చాలా సార్లు మన శరీరంలో విటమిన్ B12 తక్కువగా ఉండటం వల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఉండటానికి విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. అవకాడో, చేపలు, సీ ఫుడ్ వంటివి తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: చిన్న చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చు.. ఎలాగో తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.