Hyderabad: చట్నీలో వెంట్రుకలు.. హోటల్ కు భారీ జరిమానా!

హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ Chutneys రెస్టారెంట్ చట్నీలో వెంట్రుక రావడంపై ఫుడ్ సెఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. హెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 674 ప్రకారం సదరు రెస్టారెంట్‌పై రూ.5,000 జరిమానా విధించినట్లు ఏఎంఓహెచ్ కప్రా తెలిపారు.

New Update
Hyderabad: చట్నీలో వెంట్రుకలు.. హోటల్ కు భారీ జరిమానా!

Hair Founded in Chutneys Restaurant: హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌లోని ఓ రెస్టారెంట్ లో చట్నీలో వెంట్రులకు రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా బాధితుడైన ప్రభుత్వ ఉన్నతాధికారి తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు చేయడంతో వెంటనే చర్యలు మొదలుపెట్టారు. గురువారం ఈ ఘటనపై స్పందించిన ఏఎంఓహెచ్ కప్రా హెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 674 ప్రకారం సదరు రెస్టారెంట్‌పై రూ.5,000 జరిమానా విధించారు.

అసలేం జరిగిదంటే..
హైదరాబాద్‌లోని వినియోగదారుల హక్కుల కార్యకర్త ఉమేష్ కుమార్ తన కుటుంబంతో కలిసి జూన్ 11, 2024న రెస్టారెంట్‌కు వెళ్లారు. ఎమ్మెల్యే దోసె, ఆవిరి దోసె, ప్లేటు ఇడ్లీ ఆర్డర్ చేసి తింటున్నారు. ఈ క్రమంలోనే వారు తింటున్న చట్నీలో వెంట్రుకులు రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే రెస్టారెంట్ మేనేజర్‌ కు చూపించడంతో.. దానికి బదులు కొత్త ఫుడ్ తెప్పించి ఇచ్చారు. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న ఉమేష్ కుమార్ వెంట్రెకతో కూడిన చట్నీ ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ.. 'హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర రాధిక సమీపంలోని ఏఎస్ రావు నగర్ Chutneys రెస్టారెంట్ లో అందించిన చట్నీలో వెంట్రుక వచ్చింది. చట్నీస్ మేనేజర్ దృష్టికి తీసుకువెళితే.. అతను దానిని అంగీకరించి వెంటనే మరొక కొత్త వంటకంతో నష్టాన్ని భర్తీ చేశాడు. కానీ ఇది అసహ్యకరమైన అనుభవం' అంటూ ఆదేదన వ్యక్తం చేశాడు.

Also Read: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇన్‌స్పెక్టర్

Advertisment
తాజా కథనాలు