GWMC: వరంగల్ మహా నగర పాలక సంస్థ (GWMC) అక్రమ నిర్మాణాల పై కొరడా ఝుళిపిస్తోంది. గత కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాలను కూల్చే పనిలో ఉంది. ఇప్పటికే నగరంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చడంలో అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా వారి కన్ను బీఆర్‌ఎస్ కార్యాలయాల మీద పడినట్లు తెలుస్తుంది.
కేటీఆర్ భూమి పూజ..
తాజాగా వారు వరంగల్ నాయుడు పంపు చౌరస్తాలోని బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి కేటాయించిన భూమిలోని కమర్షియల్ షట్టర్లను కూల్చివేసే పనిలో పడింది. నాయుడు పంపు చౌరస్తాలోని ఎకరం భూమి ని గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం కోసం కేటాయించింది. పార్టీ కార్యాలయం నిర్మించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ భూమి పూజా కూడా చేశారు.
బడా నేతలు అక్రమ నిర్మాణాలు..
భూమి పూజ చేసి పది నెలలు గడిచినా పార్టీ భవనాన్ని మాత్రం నిర్మించలేదు. కానీ కమర్షియల్ షట్టర్లను మాత్రం నిర్మించి వదిలేశారు. ఈ క్రమంలోనే ఆ భూమిలో కొంతమంది బడా నేతలు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీని గురించి టీఎష్ ముఖ్యమంత్రికి కొందరు స్థానికులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో శనివారం నాడు వరంగల్ అధికారులు పోలీసుల సాయంతో షట్టర్లు కూల్చి వేసే పని లో పడ్డారు.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ కోసం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్స్ తో పాటు నగరంలోని 11 వ డివిజన్ ములుగు రోడ్ కాపువాడలో అక్రమ నిర్మాణాలను జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు.
Also read: ఉద్యోగ ఆదాయం లేకపోయినా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే: కోర్టు!