GVL: విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తా.. టికెట్ రాకపోవడంపై జీవీఎల్ రియాక్షన్

తనకు విశాఖ బీజేపీ టికెట్ దక్కకపోవడంపై జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు.

New Update
GVL: విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తా.. టికెట్ రాకపోవడంపై జీవీఎల్ రియాక్షన్

విశాఖ ఎంపీ టికెట్ రాకపోవడంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు కలత చెందారన్నారు. మూడేళ్లుగా విశాఖలోనే ఉంటూ..అనేక సమస్యలకు పరిష్కారం చూపానని గుర్తు చేశారు. విశాఖ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశానని గుర్తు చేశారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదన్నారు. ఎన్నికల కోసం తాను ఇక్కడ సేవ చేయలేదన్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు. విశాఖలోనే ఉంటా, అభివృద్ధికి భవిష్యత్తులో కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ హైకమాండ్ నిన్న ప్రకటించింది. అరకు (ఎస్టీ) అభ్యర్థిగా కొత్తపల్లి గీత, అనకాపల్లి-సీఎం రమేష్, రాజమండ్రి-పురంధేశ్వరి, నరసాపురం-భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి (ఎస్సీ)-వరప్రసాద్ రావు, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి పేర్లతో జాబితాను విడుదల చేసింది.

అయితే.. నరసాపురంలో రఘురామకృష్ణరాజు బదులుగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా.. వైజాగ్ లో జీవీఎల్ నరసింహరావుకు కూడా టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు