Ceiling Collapses : భారీ వర్షాలకు కూలిన గౌహతి ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు..!

భారీ వర్షాలు, వడగళ్ల వాన మేఘాలయ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 24గంటల్లో అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భారీ వర్షానికి గౌహతిలోని ఎయిర్ పోర్టులో పై కప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

Ceiling Collapses : భారీ వర్షాలకు కూలిన గౌహతి ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు..!
New Update

Heavy Rains : మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు వడగళ్ల వాన అతలాకుతం చేస్తోంది. గౌహతిలో ఆదివారం కురుస్తున్న భారీ తుఫాను(Huge Storm), ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సీలింగ్‌లో కొంత భాగం కూలిపోయింది(Ceiling Collapses). ఈ ప్రాంతాన్ని బలమైన తుఫాను తాకడంతో టెర్మినల్ భవనం వెలుపల పైకప్పు ఒక భాగం ఎగిరిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఒక పెద్ద చెట్టు కూలిపోయి విమానాశ్రయానికి వెళ్లే రహదారిని బ్లాక్ చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ కార్యకలాపాలను నిలిపివేసింది. ఆరు విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించింది.ఆరు విమానాలను దారి మళ్లించామని గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(Lokpriya Gopinath Bordoloi International Airport) చీఫ్ ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్ ఉత్పల్ బారుహ్ తెలిపారు.

అటు ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఆదివారం తుఫాను విధ్వంసం సృష్టించింది. దీని ఫలితంగా నలుగురు వ్యక్తులు మరణించారు. 70 మంది గాయపడ్డారు. బలమైన గాలుల కారణంగా జిల్లా కేంద్రమైన పట్టణం, మైనగురి వంటి పరిసర ప్రాంతాల్లో అనేక ఇళ్లు ధ్వంసం, చెట్లు నేలకూలడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో భారీ నష్టం జరిగింది. రాజర్‌హత్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి : ఎంపీ స్థానాలకు ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..!

#airport #ceiling-collapses #flights-diverted #airplanes #heavy-rain
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe