Gutta Jwala : వారి ప్రాణాలకు నీవు బాధ్యత వహిస్తావా? సమంతపై గుత్తజ్వాల ఫైర్!

హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ చిట్కా సూచించిన సమంతపై బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎదుటి వారికి సహాయం చేయాలనే మీ ఆలోచన మంచిదే. కానీ జరగరానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? అంటూ మండిపడింది. గుత్తజ్వాల పోస్ట్ వైరల్ అవుతోంది.

New Update
Gutta Jwala : వారి ప్రాణాలకు నీవు బాధ్యత వహిస్తావా? సమంతపై గుత్తజ్వాల ఫైర్!

Samantha : నటి సమంతపై బ్యాడ్మింటన్ ప్లేయర్ (Badminton Player) గుత్తాజ్వాల (Gutta Jwala) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ చికిత్సా విధానాన్ని ఇతరులు కూడా అనుసరించాలంటూ దేని ఆధారంగా చెబుతున్నారంటూ ప్రశ్నించింది. అంతేకాదు వారి ప్రాణాలకు మీరు గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ చిట్కా సూచించిన సమంతపై ఇప్పటికే డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. కాగా సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ వైద్య నిపుణులు (Medical Professionals) హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆమెను జైల్లో పెట్టాలంటూ పలువురు నెట్టింట పోస్టులు పెడుతూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే గుత్త జ్వాల తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.

publive-image

‘జనాలకు హెల్త్ టిప్స్ (Health Tips) ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు సూచించిన ట్రీట్మెంట్ అవతలివారికి ఉపయోగపడకపోగా మరణిస్తే వారి పరిస్థితేంటి? ఎదుటి వారికి సహాయం చేయాలనే మీ ఆలోచన మంచిదే. కానీ జరగరానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్‌ బాధ్యత తీసుకుంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా సామ్ పై మండిపడింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుతండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.

Also Read : హైదరాబాద్‌ దీ కేవ్‌ పఫ్‌ క్లబ్‌లో డ్రగ్స్‌ కలకలం.. 50 మంది అరెస్ట్!?

Advertisment
తాజా కథనాలు