Khalistan Terrorist : అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..యోగిని చంపేస్తాం: ఖలిస్తానీ వాదుల హెచ్చరిక!

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సమయంలో విధ్వంసం సృష్టిస్తామని..యూపీ ముఖ్యమంత్రి యోగిని చంపేస్తామంటూ ఖలిస్థాని వేర్పాటు వాది సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

New Update
Khalistan Terrorist : అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..యోగిని చంపేస్తాం: ఖలిస్తానీ వాదుల హెచ్చరిక!

Ayodhya : దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించాలనుకుంటున్న అయోధ్య రామ మందిర(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో విధ్వంసం సృష్టించి ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌(Yogi Adityanath) ను చంపేస్తామని ఖలిస్థానీ వేర్పాటు వాది సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ గురుపత్వంత్‌ సింగ్‌ పన్న తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

చంపేస్తామంటూ హెచ్చరికలు..

ఇప్పటికే అయోధ్యలో ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను యూపీ ఏటీఎస్‌(UP ATS) పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పన్నూ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సమయంలో విధ్వంసం సృష్టిస్తామని.. యూపీ ముఖ్యమంత్రి యోగిని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు.

విధ్వంసం సృష్టించడం..

దీంతో అయోధ్య(Ayodhya) లో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. రామ్‌ లల్లా(Ram Lalla) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టించడంతో పాటు యూపీ ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ తాజాగా ఆడియో సందేశం విడుదల చేశాడు.

శుక్రవారం నాడు అయోధ్యలో యూపీ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్‌ -ఏటీఎస్‌ పోలీసులు ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ తరువాత పన్నూ మాట్లాడిన ఆడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఖలిస్థానీ సానుభూతిపరులను వేధించవద్దని ఆ ఆడియోలో పేర్కొన్నాడు.

ఈ ఆడియో మెసేజ్‌ బ్రిటన్‌ కు చెందిన ఓ నంబరు నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయోధ్య ప్రారంభోత్సవం , రిపబ్లిక్‌ డే వేడుకల్లో విధ్వంసం సృష్టిస్తామని పన్నూ హెచ్చరికలు చేశాడు. రిపబ్లిక్‌ డే రోజున పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, డీజీపీని చంపేస్తామని పన్నూ కొద్ది రోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశాడు.

Also read: రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ!

Advertisment
తాజా కథనాలు