Guntur Murder Case: అమ్మతో అక్రమ సంబంధం.. బిడ్డ మర్డర్.. గుంటూరు కేసులో బిగ్ ట్విస్ట్!

AP: గుంటూరు బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఆ బాలిక తల్లి ఇందిరమ్మతో నిందితుడు నాగరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా హత్య చేసిన నాగరాజు ఇంట్లో తల్లి ఇందిరమ్మ గాజులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

Guntur Murder Case: అమ్మతో అక్రమ సంబంధం.. బిడ్డ మర్డర్.. గుంటూరు కేసులో బిగ్ ట్విస్ట్!
New Update

Guntur Murder Case: గుంటూరు బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మృతురాలు తల్లికి, నిందితుడు నాగరాజుకు మూడేళ్ల పరిచయం ఉందని పోలీసులు గుర్తించారు. నిందితుడు నాగరాజు ఇంట్లో ఆ బాలిక తల్లి ఇందిరమ్మ గాజులు లభించాయి. ఇందిరమ్మకు, నాగరాజుకు ఈమధ్యే మనస్పర్థలు వచ్చాయి. ఇందిరమ్మకు, నాగరాజుకు మధ్య సంబంధం ఏంటి? అనే దానిపై ఇందిరమ్మను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

విచారణలో నాగరాజు గురించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నాగరాజుపై 2 హత్య కేసులు, మరో హత్యాయత్నం కేసు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఓ మహిళ హత్య, మరో మహిళపై హత్యాయత్నం చేశాడు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఏడో తరగతి విద్యార్థిని శైలజను తన ఇంట్లో హత్య చేశాడు గ్యాస్ డెలివరీ బాయ్‌ నాగరాజు. ప్రస్తుతం నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు. నాగరాజు కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయి.

అసలేం జరిగింది..

ఈ నెల 15న గుంటూరు జిల్లా చేబ్రోలు కొత్తరెడ్డిపాలెం గ్రామంలో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. స్కూలుకు వెళ్లిన విద్యార్థిని మళ్ళీ తిరిగిరాని లోకానికి వెళ్ళింది. ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి మిస్టరీగా మారింది. ఉదయాన్నే స్కూల్ కి వెళ్లిన ఆ బాలిక కొంత సమయం తర్వాత కడుపు నొప్పి అని స్కూల్ నుండి ఇంటికి బయలుదేరింది. అలా బడి నుంచి వచ్చిన అమ్మాయి గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది. దీంతో ఆమె మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నాగరాజు ఇంటిని పరిశీలించగా.. అతని ఇంట్లో ఆ బాలిక బుక్స్, బ్యాగ్ దొరికాయి. ప్రస్తుతం డెలివరీ బాయ్ నాగరాజు పరారీలో ఉన్నాడు.

#crime-news #guntur-murder-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe