Guntur Karam premiere shows: గుంటూరు కారం రిలీజ్ కు ముందే రికార్డులు

మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం మూవీ రిలీజ్ దగ్గర పడుతోంది. రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్స్ లో 5408కు పైగా ప్రీమియర్ షోలు వేస్తుండటంతో సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించడం విశేషం.

New Update
Guntur Karam premiere shows: గుంటూరు కారం రిలీజ్ కు ముందే రికార్డులు

5408కు పైగా ప్రీమియర్ షోలు

ఇక..పండగకు రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తె.. నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో అత్యధిక థియేటర్స్ గుంటూరు కారం మూవీకి కేటాయించడం విశేషం. మహేష్, త్రివిక్రమ్ క్రేజ్ దృష్ట్యా ..ఈ మూవీకి ఉన్న బజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యదిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట తరువాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ లో వస్తోన్న ఈ మూవీ పై ఓవర్సీస్ లోనూ బారీ బజ్ క్రియేట్ అయ్యింది.యుఎస్ లో ఈ మూవీ 5408కు పైగా ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో అమెరికాలో రీలిజయిన ఏ తెలుగు సినిమాతో పోల్చి చూసినా గుంటూరు కారం ప్రీమియర్ షోలకు మించి లేవు.సో..ఆ విషయంలో మహేష్ బాబు రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించడం గొప్ప విషయమే.

ALSO READ:DEVARA FIRST GLIMPS :ఎన్టీఆర్.. ‘దేవర’ ఫస్ట్ గ్లింప్స్‌ టైమ్ ఫిక్స్

అర్అర్అర్ ను మించి భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు

గుంటూరు కారం కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతున్నా అర్అర్అర్ ను మించి భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేయడం ఒక్క సూపర్ స్టార్ కే చెల్లింది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంచలనాలు సృష్టించడం మహేష్ కే సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 ఓటిటీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం

బిజినెస్ పరంగా చూసుకుంటే గుంటూరు కారం మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.ఓటీటీ వెర్షన్ విషయానికి వస్తె..ఈ మూవీ ఇతర భాషల్లో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెట్ ఫ్లిక్స్ ఓటిటీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.చూడాలి మరి .రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.

ALSO READ:Thandel Glimpse video: పాకిస్తాన్ అడ్డాలో భరతమాత బిడ్డ విశ్వరూపం… దుమ్మురేపుతోన్న నాగచైతన్య తండేల్ గ్లింప్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు