బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సూప‌ర్‌స్టార్ కృష్ణ అందించిన సేవ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న ఓ చెర‌గ‌ని ముద్ర వెసుకున్నారు. అత్య‌ధిక చిత్రాల్లో న‌టించిన ఏకైక ఓ లెజెండ్‌గా కృష్ణ పేరు పొందారు. బుర్రిపాలెం బుల్లోడిగా ఆయ‌నో సంచ‌ల‌నం. ఆయ‌న‌కు స్వ‌గ్రామం అంటే ఎంతో ఇష్టం. సినిమాల్లోకి వెళ్లినా ఏ నాడు స్వ‌గ్రామాన్ని మ‌రువ‌లేదు.హైదరాబాద్‌లో స్థిరపడిన తర్వాత కూడా సొంత ఊరుకి వెళ్లేవారు. ఇప్ప‌టికీ గ్రామంలో మూడంత‌స్తుల భ‌వ‌నం ఉంది. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎవ‌రెళ్లినా ఆ ఇంట్లోనే బ‌స‌ చేస్తారు.

బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
New Update

సొంత ఊరులో కృష్ణ విగ్రహం

బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు.. సూపర్ స్టార్ సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విజయవాడ నుంచి బుర్రిపాలెం వరకూ ఫాన్స్ ర్యాలీ నిర్వహించనున్నారు. కృష్ణ గత ఏడాది నవంబర్ 15న కన్నుమూసిన విషయం తెలిసిందే.

కృష్ణ జ్ఞాప‌కార్దంగా..

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, హీరో సుదీర్ బాబు దంపతులు, కృష్ణ కూతుళ్లు మంజుల మరియు పద్మావతి, దర్శకుడు కృషారెడ్డి, మాజీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంకు టాలీవుడ్ సూపర్ స్టార్, కృష్ణ కుమారుఫు మహేష్ బాబు ఈ వేడుక‌కు హాజరుకానట్టు తెలుస్తోంది. స్వ‌గ్రామంలో తండ్రి కాంస్య విగ్రహం ఆవిష్క‌ర‌ణ‌కు ఆయ‌న వ‌స్తే బాగుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ గుంటూరు కారంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న షూట్లో బిజీగా ఉన్నారా? విదేశాలకు వెకేష‌న్‌కి వెళ్లారా? అన్న‌ది స్పష్ట‌త లేదు.

publive-image

అనేక అభివృద్ధి కార్యక్రమాలు

కృష్ణ తల్లి పేరు నాగరత్నమ్మ. ఆమె పేరుమీదే పాఠశాల ఉంది‌. గీతా మందిరం.. బస్టాఫ్.. ఆలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ నేప‌థ్యంలో గ్రామ‌స్తులు.. అభిమానులు కృష్ణ జ్ఞాప‌కార్దం కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఆగ‌స్టు 5 (నేడు) ఈ కార్య‌క్ర‌మం నిర్వహించినట్లు ఆదిశేష గిరిరావు తెలిపారు. కృష్ణ..మ‌హేష్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సుధాస్వామి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe