guntur: చంద్రబాబు వల్లే రాష్ట్రానికి తీరని ద్రోహం: చలసాని శ్రీనివాస్

గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ విషమ పరిస్థితిలోకి నెట్టివేయబడుతుందని ఆయన మండి పడ్డారు.

New Update
guntur: చంద్రబాబు వల్లే రాష్ట్రానికి తీరని ద్రోహం: చలసాని శ్రీనివాస్

విషమ పరిస్థితిలోకి నెట్టేశారు

గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ విషమ పరిస్థితిలోకి నెట్టివేయబడుతుందన్నారు. నేడు పాలకులు ఢిల్లీ చుట్టూ తిరిగే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు.ఉత్తరాధిన దిక్కులు పిక్కటిల్లేలా అరిచిన కళ్యాణ్ బాబు కేంద్ర అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నమ్మక ద్రోహం, నయవంచన చేస్తోందన్నారు. ఎంతోమంది పెద్దల త్యాగధనంతో తెచ్చుకున్న ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎవరూ మాట్లాడక పోవడం చాలా బాధకారం అన్నారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.

పార్టీలను తుక్కుగా ఓడించండి

ముఖ్యమంత్రి జగన్ చేసే కక్ష్య సాధింపు చర్యలతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని జగన్‌ ప్రభుత్వంపై సీనియర్‌ అయ్యారు. సక్రమ పద్ధతిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై పోరాటం ఎవరూ చేయటం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీని గద్దె దించే పనిమీద కాక అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రం నాశనం అయిపోతుంది, అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఏ పార్టీ అయితే మద్దత్తు ఉంటుందో అలాంటి పార్టీలను తుక్కుగా ఓడించండి అన్నారు.

తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా..

చంద్రబాబుకు, జగన్‌కి, పవన్ కళ్యాణ్‌లకు మధ్య చిచ్చు పెట్టి బీజేపీ చోద్యం చూస్తుందన్నారు. ఏపీలో గెలిచిన ఎంపీలు ఢిల్లీలో మోడీకి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల విద్యార్థులతో కలిసి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తున్నాం అని ఆయన సవాల్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా నన్ను నమ్మండని ఒట్టు వేసిన నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇవ్వ లేదని ఆయన గుర్తు చేశారు. 24 స్థానాలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తానన్న ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ఏ ఒక్క పార్టీ కూడా పెదవి విప్పడం లేదని ఆయన మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు