నాటు తుపాకీ పేలి..నాలుగేళ్ల చిన్నారి మృతి!

New Update
నాటు తుపాకీ పేలి..నాలుగేళ్ల చిన్నారి మృతి!

దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంటే కాకినాడ జిల్లాలో మాత్రం దారుణం చోటు చేసుకుంది. పందులను చంపేందుకు వాడిన తుపాకీ తూటా తగిలి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వెలమకొత్తూరులో మంగళవారం పంద్రాగస్టు వేళ చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెలమకొత్తూరు గ్రామంలో అనుమతులు లేకుండా వేటగాళ్లు నాటు తుపాకులతో వేటాడుతూ పందులపై కాల్పులు జరిపారు.

ఆ సమయంలో అక్కడ మరి కొంత మంది చిన్నారులతో కలిసి ధన్యశ్రీ అనే నాలుగేళ్ల పాప ఆడుకుంటుంది. వేటగాళ్లు పేల్చిన తుపాకీ తూటా గురి తప్పడంతో అది చిన్నారికి తగిలింది. దీంతో చిన్నారి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి పాప ప్రాణాలు కోల్పొయింది. దీంతో పాప తల్లిదండ్రులు గుండెలు విలసేలా రోదించారు.

చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు