గల్ఫ్ ఏజెంట్‌ భారీ మోసం..ఫిర్యాదు చేసిన బాధితులు

ప్రజలకు ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడ పని చూపిస్తానని చెప్పి ఓ ఏజెంట్‌ 60 మందిని మోసం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అమాయక గ్రామ ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు తీసుకున్నాడు లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్.

గల్ఫ్ ఏజెంట్‌ భారీ మోసం..ఫిర్యాదు చేసిన బాధితులు
New Update

Gulf Agent is a huge fraud..Victims who complained

కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌ ప్రధాన రోడ్డులో కార్యాలయాన్ని నిర్వహిస్తూ గల్ఫ్‌ ఏజెంట్‌గా చెలామణి అయిన దోమకొండ మండలానికి చెందిన ఒకరు 60 మందిని మోసగించిన సంఘటన వెలుగు చూసింది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది నుంచి గల్ఫ్‌ దేశాలకు పంపించేందుకు రూ. 40 లక్షల వరకు వసూలు చేశాడు. ఏడాది కాలంగా ఏజెంట్‌ చుట్టూ తిరిగిన బాధితుల్లో 16 మందిని రష్యా దేశానికి పంపించాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి వెనుదిరిగిన బాధితులు ఏజెంట్‌ను నిలదీయగా డబ్బులు ఇస్తానని మభ్యపెట్టాడు. చివరకు ఐపీ నోటీసులు పంపించడంతో బాధితులు లబోదిబోమన్నారు.

కామారెడ్డి కోర్టుకు హాజరైన బాధితులంతా తమ గోడును వెల్లబోసుకునేందుకు డీఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సమస్యను విన్నవించారు. బాధితుల వద్ద ఉన్న ఆధారాలతో ఏజెంట్‌పై కేసునమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe