Business : పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా? అయితే చక్కగా నాలుగు గాడిదలు కొనుక్కోండి.. చాలు! పరీక్షల్లో తప్పితే గాడిదలు కొనిస్తామని పేరెంట్స్ అంటే బాధపడకండి..గాడిదల వల్ల కూడా సంవత్సరం తిరిగే లోపు కోటీశ్వరులు అవ్వొచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.. By Bhavana 22 Apr 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Gujarat : పరీక్షల్లో ఫెయిల్(Exams Fail) అయితే గాడిద(Donkeys) లు కాసుకుంటావు అని చిన్నతనం నుంచి కూడా మనల్ని తల్లిదండ్రులు అనే మాట.. మనం వినే మాట.. ఎలాగైనా చదివి పాస్ అవుతారు అనే ఉద్దేశంతో వారు అలా అంటారు. అయితే గాడిదలు కొనిస్తామంటే ఈసారి నుంచి మీరు బాధ పడక్కర్లేదు. హ్యాపీగా నాలుగు గాడిదలు కొనుక్కోని కోటీశ్వరులు అయ్యి చూపించాడు ఓ వ్యక్తి. అది కూడా కేవలం ఏడాది లోపే. ఇదంతా ఎలా జరిగింది అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లిపోవాల్సిందే. ధీరెన్ సోలంకి ప్రభుత్వ ఉద్యోగం(Government Job) కోసం ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయాడు. కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండడంతో ఓ ప్రైవేట్ ఉద్యోగం(Private Job) లో చేరాడు. కానీ వచ్చే జీతం కుటుంబ అవసరాలను తీర్చకపోగా అప్పుల పాలయ్యాడు. అదే టైంలో దక్షిణ భారతదేశంలో గాడిద పాలకు ఉన్న డిమాండ్ తెలుసుకుని.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించి వెంటనే ఆ పని ప్రారంభించాడు. రూ. 22లక్షల ఇన్వెస్ట్మెంట్ తో 20 గాడిదలు కొని ఫార్మ్ మొదలు పెట్టాడు. పాలు అమ్ముతున్నాడు. కాగా ఈ గాడిద పాలు ఆవు పాల కన్నా దాదాపు 70 రెట్లు అధిక ధర పలుకుతుండటం.. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులను నయం చేస్తుందనే సైంటిఫిక్ ప్రూఫ్, నమ్మకం ఉండటం.. ఆయనకు కలిసొచ్చింది. దీంతో ఒక్క లీటరు గాడిద పాలను రూ. 5000 కు అమ్ముతూ ఏడాదికి రూ. 2.5 కోట్లకుపైనే సంపాదిస్తున్నాడు.కాగా వ్యాపారం ప్రారంభించిన మొదటి ఐదు నెలలు కొద్దిగా కష్టపడినా.. గుజరాత్ నుంచి వ్యాపారాన్ని సౌత్ ఇండియాకు మార్చేసి మంచి లాభాలు గడిస్తున్నాడు. మీకు కూడా ఈ గాడిదపాలు కావాలా అయితే tdsdonkeyfarm.in వెబ్ సైట్ ఓపెన్ చేసి వివరాలు తెలుసుకుని ఆర్డర్ చేసుకోండి. Also read: అమెరికా పౌరులుగా రికార్డు సృష్టించిన భారతీయులు! #gujarat #donkeys #business #milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి