Floods: ధ్వంసమైన ఇళ్లు.. నలిగిన బతుకులు.. 49 మందిని ముంచేసిన వరదలు..! గుజరాత్‌లో ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు 49 మంది చనిపోయారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహా వివిధ ఏజెన్సీలు 37 వేల మందిని రక్షించాయి. By Jyoshna Sappogula 04 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Floods: ఓవైపు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు నాన్‌స్టాప్‌గా దాడి చేస్తుంటే మరోవైపు గుజరాత్‌పైనా ఇదే రకమైన అటాక్ చేస్తున్నాడు. ఏడు రోజులగా భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు 49 మంది చనిపోయారు. తీవ్ర అల్పపీడనం కారణంగా గుజరాత్‌లోనిని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. పిడుగుపాటు, గోడ కూలిపోవడం, వరద నీటిలో మునిగిపోవడం లాంటి ఘటనల్లో మొత్తం 49 మంది మరణించారని గాంధీనగర్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకటించింది. Also Read: సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి? ఎలా డొనేట్ చేయాలి? గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 17 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన 27 బృందాలు, ఆర్మీకి చెందిన 9 కాలమ్స్, భారత వైమానిక దళం, కోస్ట్ గార్డ్స్‌కు చెందిన అదనపు బృందాలను మోహరించారు. ఈ బృందాలు ఇప్పటివరకు 37,050 మందిని రక్షించాయి. ఇక 42,083 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వర్షాల ప్రభావిత జిల్లాల్లో ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. 4,673 బాధిత ఇళ్లు, గుడిసెల యజమానులకు రూ.3.67 కోట్ల సాయాన్ని ఇప్పటికే అధికారులు పంపిణీ చేశారు. #gujarat-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి