Gudlavalleru College Incident: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ వ్యవహారంలో సంచలన నిజాలు..

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో గురువారం సాయంత్రం వాష్‌ రూంలో మైక్రో కెమెరా దొరికిందని.. అందుకే తాము ఆందోళనకు దిగామని విద్యార్థినులు తెలిపారు. వారం రోజుల క్రితమే కాలేజ్‌ ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే సాక్ష్యాలు చూపించాలన్నారని చెప్పారు.

Gudlavalleru College Incident: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ వ్యవహారంలో సంచలన నిజాలు..
New Update

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో సీక్రెట్‌ కెమెరాలు బయటపడటం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సంచనల నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా RTVతో కాలేజ్ స్టూడెంట్స్‌ మాట్లాడారు. గురువారం సాయంత్రం వాష్‌ రూంలో మైక్రో కెమెరా దొరికిందని.. అందుకే తాము ఆందోళనకు దిగామని విద్యార్థినులు తెలిపారు. '' ఈ సీక్రెట్‌ కెమెరా పెట్టిన నిందితుల్లో ఆ అబ్బాయిని పోలీసులు కొట్టారు. అమ్మాయిని ఏమనలేదు. సీక్రెట్‌ కెమెరాతో మొత్తం 360 వీడియోలు అమ్ముకున్నారు. అలా అమ్ముకోగా వచ్చిన డబ్బులతో బైక్స్ కొన్నారు. హాస్టల్ నుంచి వీడియోలు బయటకు వస్తున్నాయని.. గత వారం రోజుల క్రితమే కాలేజ్‌ ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాం.

Also Read: హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివస్తుందా?

కానీ వాళ్లు సాక్ష్యాలు ఉంటేనే చర్యలు తీసుకుంటామని అన్నారు. బయట భద్రత లేదనే కారణంతోనే హాస్టల్స్‌లో ఉంటున్నాం. ఈ సీక్రెట్ కెమెరాను పెట్టిన ఆ ఇద్దరు స్టూడెంట్స్‌ ఫైనల్‌ ఇయర్ చదువుతున్నారు. రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారు. ఈ వీడియోలను బాయ్స్‌ గ్రూప్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత ఒక అమ్మాయిని బ్లాక్‌ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నీ వీడియో వీడియో డిలీట్ కావాలంటే వేరే వాళ్లవి కావాలని డిమాండ్ చేశారు. ఆ అమ్మాయికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. మొదట ఆ అమ్మాయి నేను తప్పు చేశానని ఒప్పుకొని.. ఆ తర్వాత మాట మార్చేసింది. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పోలీసుల అదుపులో ఉన్నారని'' విద్యార్థులు తెలిపారు.

Also Read: లోకేష్ ను కాపాడడం కోసమే.. గుడ్లవల్లేరు ఘటనపై జగన్ సంచలన కామెంట్స్!

#andhra-pradesh #gudlavalleru-engineering-college #hidden-camera #secret-camera
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe