GST Collections: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంత పెరిగాయంటే..

ప్రభుత్వం జూలై 2024లో GST నుండి రూ. 1.82 లక్షల కోట్లు వసూలు చేసింది. వార్షిక ప్రాతిపదికన 10.3% పెరిగింది. ఇది ఇప్పటివరకు ఏ నెలలోనైనా కలెక్ట్ అయిన మూడవ అతిపెద్ద GST కలెక్షన్. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండవ అతిపెద్ద GST వసూలు.

New Update
GST New Rule: జీఎస్టీ నిబంధనల్లో మార్పు.. చిన్న వ్యాపారులకు ఇబ్బందే.. 

GST Collections:  జీఎస్‌టీ వసూళ్లతో ప్రభుత్వానికి రికార్డు ఆదాయం వచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జూలై 2024లో స్థూల GST వసూళ్లు 10.3 శాతం పెరిగి రూ.1,82,075 కోట్లకు చేరాయి. రీఫండ్ తర్వాత, జూలై 2024కి నికర GST రాబడి రూ. 1,44,897 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 14.4 శాతం పెరుగుదలను చూపుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో 10 శాతానికి పైగా వృద్ధి అంచనాలకు అనుగుణంగా ఉందని, భారత్‌లో జీఎస్టీ స్థిరత్వం - పరిపక్వతను సూచిస్తోందని కేపీఎంజీ పరోక్ష పన్ను విభాగాధిపతి అభిషేక్ జైన్ అన్నారు.

ఈ సమయంలో దేశీయ వ్యాపారం నుంచి ప్రభుత్వం రూ.1.34 లక్షల కోట్ల జీఎస్టీ  వసూలు చేసింది. దీనిలో వార్షిక ప్రాతిపదికన 8.9% వృద్ధి ఉంది. అదే సమయంలో ప్రభుత్వం దిగుమతుల ద్వారా రూ.48,039 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. ఒక్క ఏడాదిలో 14.2 శాతం పెరిగింది.

GST Collections:  జులైలో ప్రభుత్వం మొత్తం రూ.16,283 కోట్లను రీఫండ్ చేసింది. రీఫండ్‌ల తర్వాత, జూలైలో నికర GST ఆదాయం రూ.1,65,793 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం (జూలై 2023) ఇదే కాలంతో పోలిస్తే 14.4% ఎక్కువ.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు GST వసూళ్లు

నెల GST వసూళ్లు (లక్ష కోట్లలో)
ఏప్రిల్ 2024 ₹2.10
మే 2024 ₹1.73
జూన్ 2024 ₹1.74
జూలై 2024 ₹1.82
మొత్తం ₹7.39

గమనిక: గణాంకాలు లక్ష కోట్ల రూపాయలలో.. సోర్స్: GST పోర్టల్

టాప్-5 GST కలెక్షన్

ఏప్రిల్ 2024 ₹2.10 లక్షల కోట్లు
ఏప్రిల్ 2023 ₹1.87 లక్షల కోట్లు
జూలై 2024 ₹1.82 లక్షల కోట్లు
మార్చి 2024 ₹1.78 లక్షల కోట్లు
మే 2024 ₹1.73 లక్షల కోట్లు

జూన్‌లో జిఎస్‌టి డేటాను ప్రభుత్వం విడుదల చేయలేదు. అయితే జూన్‌లో జిఎస్‌టి వసూళ్లు ₹ 1.74 లక్షల కోట్లకు చేరాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. . ఇది గత ఆర్థిక సంవత్సరం జూన్ కంటే ఇది దాదాపు 8% ఎక్కువ.

గతేడాది జూన్‌లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.1.61 లక్షల కోట్లు వసూలు చేసింది. మే 2024 వసూళ్లను పరిశీలిస్తే, జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.1.73 లక్షల కోట్లు వసూలు చేసింది. అంటే మే, జూన్ వసూళ్లు దాదాపు సమానంగానే వచ్చాయి.

Advertisment
తాజా కథనాలు