వస్తు సేవల పన్ను అంటే GST ద్వారా(GST Collections) ఏప్రిల్ 2024లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ నెలలోనైనా వసూలు చేసిన అత్యధిక జీఎస్టీ వసూళ్లు ఇదే. మునుపటి (GST Collections)అత్యధిక వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లు, ఇది ఏప్రిల్ 2023లో జరిగింది. అంటే సరిగ్గా సంవత్సరం తరువాత రికార్డ్ బ్రేక్ అయింది. స్థూల జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12.4% పెరిగాయి. కాగా, గత నెలలో అంటే మార్చి 2024లో జీఎస్టీ వసూళ్లు(GST Collections) రూ. 1.78 లక్షల కోట్లు. అంటే నెలవారీగా వసూళ్లలో 18% పెరుగుదల ఉంది. 18 వేల కోట్ల విలువైన రీఫండ్లను ప్రభుత్వంఈ నెలలో జారీ చేసింది. రీఫండ్ల తర్వాత, ఏప్రిల్ 2024లో నికర GST ఆదాయం ₹1.92 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది అంటే ఏప్రిల్ 2023తో పోలిస్తే 17.1% ఎక్కువ.
పూర్తిగా చదవండి..GST Collections: రికార్డ్ సృష్టించిన జీఎస్టీ కలెక్షన్స్.. ఈ లెక్కలు చూస్తే మతిపోతుంది!
Translate this News: