TSPSC Group-4 Results: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే? తెలంగాణలో 8, 180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిజల్ట్స్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అయ్యింది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన తుది కీని కూడా వెల్లడించింది. దసర పండగా తర్వాత మెరిట్ జాబితాను ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాతే ఎన్నికల కోడ్ తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం ఫైనల్ లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరింత సమయం ఆగాల్సిందే. By Bhoomi 17 Oct 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TSPSC Group-4 Results: తెలంగాణలో 8, 180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిజల్ట్స్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) రెడీ అయ్యింది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన తుది కీని కూడా వెల్లడించింది. పేపర్ 1 ఏడు ప్రశ్నలు, పేపర్ 2లో మూడు ప్రశ్నలు కలిపి మొత్తం 10 ప్రశ్నలను తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. ఇందులో ఐదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. ఇది కూడా చదవండి: ఐటీ ఉద్యోగులకు షాక్.. గంటకు 23 మంది ఔట్..!! కాగా ఫైనల్ కీ వెల్లడవ్వడంతో అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసింది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా లేదా జనరల్ ర్యాంకు మెరిట్ లిస్టును (Group 4 Merit List) వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరి వంటి వివరాలు ఈ జాబితాలో ఉండే ఛాన్స్ ఉంది. దసర పండగా తర్వాత మెరిట్ జాబితాను ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాతే ఎన్నికల కోడ్ తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం ఫైనల్ లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరింత సమయం ఆగాల్సిందే. ఇది కూడా చదవండి: ఏపీలో మెగా జాబ్ మేళా.. 20కి పైగా కంపెనీల్లో వేయికి పైగా జాబ్స్.. ఎల్ఐసీ, యూనియన్ బ్యాంక్ తో పాటు..!! ఇక రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లో ఉన్న గ్రూప్ 4 ఖాళీలను భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది జులై 1న పరీక్షను నిర్వహించింది. మొత్తం 9లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 7లక్షలకుపైగా పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్ కీని అక్టోబర్ లో రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. #tspsc #tspsc-group-4-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి