తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రూప్-4 పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. వారందరినీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే.. లోనికి అనుమతించారు. 15 నిమిషాల ముందే గేట్లు మూసివేశారు. By Vijaya Nimma 01 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో గ్రూప్-4 పరీక్షప్రారంభమైంది. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు రాయనున్న గ్రూప్-4 కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష జరగనుంది. పరీక్షకు 15 నిమిషాల ముందుగానే గేట్లు మూసివేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. షూ వేసుకోవద్దని.. చెప్పులతోనే రావాలని స్పష్టం చేసింది. గడియారం, హ్యాండ్ బ్యాగ్, పర్సులు తీసుకురావద్దని కమిషన్ వెల్లడించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఉద్యోగ పరీక్షలు రాయకుండా శాశ్వత డీబార్ చేస్తామని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. వారందరినీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే.. లోనికి అనుమతించారు. 15 నిమిషాల ముందే గేట్లు మూసివేశారు. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8 వేల 180 గ్రూప్-4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్షకేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఒక్క పోస్టుకు ఎంతమంది పోటీంటే? హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు చూపించాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. హాల్‌టికెట్‌పై ఫోటో లేకపోతే.. గెజిటెడ్ అధికారి సంతకంతో ఉన్న 3 ఫోటోలతో రావాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అభ్యర్థులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. వాచ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు, మొబైల్ వంటి వాటికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ ధరించవద్దని నిబంధన పెట్టారు. ఓఎంఆర్ షీటుపై బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. పెన్సిల్, జెల్, ఇంకు పెన్ను వాడితే జవాబు పత్రాన్ని ఆప్టికల్ మార్క్ స్కానర్ సిస్టం గుర్తించదని తెలిపింది. గతంలో జరిగిన పలు నియామక పరీక్షల్లో బబ్లింగ్ పొరపాట్లు వల్ల వందల మంది అనర్హులయ్యారు. ఈ నేపథ్యంలో ఓఎంఆర్ షీటుపై వ్యక్తిగత వివరాలు బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని.. వెబ్ సైట్‌లోని మోడల్ ఓఎంఆర్ షీటు డౌన్ లోడ్ చేసుకొని ప్రాక్టీసు చేయాలని టీఎస్పీఎస్సీ సూచించింది. వైట్ నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌లో మార్పులు చేస్తే ఓఎంఆర్ షీటును మూల్యాంకనం కోసం పరిగణనలోకి తీసుకోబోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఒకరి బదులు మరొకరు రాసినా.. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి