TGPSC Certificates Verification: నేటి నుంచి TGPSC గ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్! తెలంగాణలో గ్రూప్ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకీ జూన్ 20 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.ఈ పరిశీలన దాదాపు రెండు నెలల పాటు జరుగుతుంది. By Bhavana 20 Jun 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TGPSC Certificates Verification: తెలంగాణలో గ్రూప్ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకీ జూన్ 20 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ పరిశీలన దాదాపు రెండు నెలల పాటు జరుగుతుంది. ఈ ప్రతాల పరిశీలన ఆగస్టు 21 నాటికి ముగుస్తుంది. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌గార్డెన్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ప్రతిరోజూ ఉదయం, మధాహ్నం వేళల్లో పత్రాల పరిశీలన జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల పత్రాల పరిశీలనకు రాలేని వారు, ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇవ్వనివారుంటే అటువంటి వారి కోసం ఆగస్టు 24, 27, 31 తేదీలను సమర్పించవచ్చని టీజీపీఎస్సీ ప్రకటించించింది. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5గంటల తర్వాత పత్రాల పరిశీలనుకు అనుమతించేది లేదని టీజీపీఎస్సీ కార్యదర్శి డా.నవీన్ నికోలస్ పేర్కొన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్ 4 సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులకు ఈ ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి.. ప్రాథమిక వివరాలు నింపిన చెక్‌లిస్ట్, దరఖాస్తు ఫారం 2 కాపీలు, పరీక్ష హాల్‌టికెట్, బర్త్ సర్టిఫికెట్ లేదంటే పదవ తరగతి మార్కుల మెమో, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, విద్యార్హతలకు సంబంధించిన ప్రొవిజినల్, కాన్వొకేషన్ సర్టిఫికెట్, మార్కుల మెమో , తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తండ్రి లేదా తల్లి పేరుతో మాత్రమే ఉన్న కుల ధ్రువీకరణ పత్రం,మూడు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజు ఫొటోలు కావాలి. బీసీ నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ (ఓబీసీ సర్టిఫికెట్‌లను అనుమతించరు), పెళ్లైన మహిళలకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్, నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్లు భర్త పేరుతో ఉంటే అనుమతి లేదు. 2021-22 ఏడాదితో ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు సంబంధిత సంస్థ నుంచి తీసుకున్న ఎన్‌వోసీ సర్టిఫికెట్, గెజిటెడ్ అధికారి సంతకంతో 2 అటిస్టేషన్ కాపీలు,నిరుద్యోగి అని పేర్కొనే డిక్లరేషన్ పత్రం, పోస్ట్ కోడ్ 70కి అప్లై చేసిన అభ్యర్థులు తాము హిందువు అని తెలిపే డిక్లరేషన్ సర్టిఫికెట్, పోస్ట్‌కోడ్ 94, 95కు సంబంధించిన ఉద్యోగాలకైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ర్యాంక్‌కు తక్కువ కాని అధికారి నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. Also read: హజ్ యాత్రలో ఎండవేడికి 90 మంది భారతీయులు మృతి! #telangana #tgpsc #group-4 #certificates-verification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి