/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/e33UAX4CT_4-HD.jpg)
GROUP-2:తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. డిసెంబర్ లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్ - 2లో 783 పోస్టులు, 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షను డీఎస్సీ కారణంగా వాయిదా వేసింది. పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం అభ్యర్థులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పోస్టులు పెంచుతారా లేదా అనే దానిపై అనుమానం నిరుద్యోగుల్లో నెలకొంది.